Political War in YSRCP: వైసీపీలో కుమ్ములాటలు..తారస్థాయికి విభేదాలు
ABN , Publish Date - Feb 20 , 2025 | 09:12 PM
Political War in YSRCP: వైసీపీ పులివెందులలో రోజురోజుకూ వర్గపోరు తీవ్రరూపం దాల్చుతుంది. ఈ పోరుతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ మరోవర్గం ప్రదీప్‌ల మధ్య వర్గ పోరు ఓ రేంజ్‌లో కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య తలెత్తిన వివాదం పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతతకు దారితీసింది. వీరిద్దరి మధ్య వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది.

కడప : కడప జిల్లా వైసీపీలో వర్గపోరు తీవ్రమవుతోంది. ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఆధిపత్య పోరు చాపకింద నీరులా కొనసాగుతోంది. గ్రూపుల గోల ఎక్కువవుతోంది. ఎక్కడికక్కడే విభేదాలు బయటపడుతున్నాయి. నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సాక్షాత్తు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో వైసీపీ శ్రేణుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ మరోవర్గం ప్రదీప్ మధ్య వివాదం ముదిరింది. ఇరువర్గాల మధ్య పరస్పర రాళ్లదాడులు వేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. రెండు కుటుంబాల స్కూల్ విద్యార్థుల గొడవులు, పాతకక్షలు ఇరువర్గాలకు వివాదానికి కారణమైంది.
ALSO READ: CM Chandrababu: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు
ఆందోళనలో కేడర్..
పులివెందులలో ఫైర్ స్టేషన్ వద్ద ఇరువర్గాలు ఎదురెదురుగా రావడంతో పరస్పర రాళ్లదాడులు చేసుకున్నాయి. పోలీసులు రంగప్రవేశంతో గొడవ ప్రస్తుతానికి అయితే సద్దుమణిగింది. గాయపడిన వారిని ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ వివాదం ఇప్పుడు పులివెందులలో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందోనని వైసీపీనేతలు కలవరపడుతున్నారు. వైసీపీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో ప్రతిచోటా రెండు వర్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తారస్థాయిలో వర్గపోరు..
ఇటీవల పులివెందులలో బయటపడిన విభేదాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. వైసీపీ కీలక నేతలు పాల్గొనే కార్యక్రమానికి కూడా ఈ రెండు వర్గాలు అంటీముట్టన్నట్లుగా దూరంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్ మరోవర్గం ప్రదీప్ మధ్య విభేదాలు ఏ స్థాయికు చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు తారస్థాయిలో కొనసాగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతల వివాదంతో స్థానిక వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా వైసీపీలో ఇప్పుడున్న పరిస్థితి మరింత ముదిరితే.. దీని ప్రభావం ఎంతవరకు వెళ్తుందోనని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ వర్గ పోరుపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టాలని నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Minister Anitha: ఆ అధికారులపై హోంమంత్రి అనిత ప్రశంసలు
YS Sharmila: ఐదేళ్లు దోచుకున్నారు.. బొత్సపై షర్మిల ఫైర్
Vamshi Case: వంశీ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. కోర్టు ఏం చెప్పిందంటే
Read Latest AP News And Telugu News