Vamshi: కోట్ల విలువైన స్థలం కబ్జా.. వంశీపై మరో కేసు
ABN , Publish Date - Feb 25 , 2025 | 10:25 AM
Vamshi: వరుస కేసులతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఇప్పటికే జైలులో వంశీపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది.

కృష్ణా జిల్లా, ఫిబ్రవరి 25: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు కిడ్నాప్ వ్యవహారంలో అరెస్ట్ అయి జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై (Former MLA Vallabhaneni Vamshi) మరో కేసు నమోదు చేశారు. గన్నవరం పోలీస్‌స్టేసన్‌లో వంశీపై భూకబ్జా కేసును నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్‌లో 10 కోట్లు విలువైన స్థలం కబ్జాపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. హైకోర్ట్ న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు వచ్చింది. వ్యవస్థీకృత నేరం క్రింద కేసు నమోదు చేయాలి అని హైకోర్ట్ న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి ఫిర్యాదు చేశారు.
వల్లభనేని వంశీ తో పాటు మరో 15 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఆ రోజు స్థలం కబ్జాపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదులో హైకోర్ట్ న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి పేర్కొన్నారు. కాగా.. వంశీ అక్రమాలపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వంశీపై నమోదైన భూకబ్జా కేసును కూడా దర్యాప్తు బృందానికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈకేసును అక్కడకు బదిలీ చేయాలంటూ ఫిర్యాదుదారులు కోరారు. తమ వద్ద ఉన్న ఆధారాలు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ సిట్ బృందానికి ఇస్తామని న్యాయవాది సతీమణి బంధువులు చెబుతున్నారు.
నేడు పోలీసుల కస్టడీకి వంశీ
మరోవైపు ఈరోజు నుంచి మూడు రోజుల పాటు వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, మంచం సదుపాయాలు కల్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. వంశీని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు పలు ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో రోజుకు నాలుగు సార్లు వంశీ తరుపున న్యాయవాదులకు కలిసేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. విజయవాడ లిమెట్స్‌లోనే వంశీని విచారించాలని కోర్టు ఆదేశించింది. సత్య వర్ధన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధారంగా చేసుకుని వంశీని పోలీసులు విచారించనున్నారు. ఇదిలా ఉంటే వంశీ బెయిల్ కోసం ఇప్పటికే కోర్టులో వంశీ తరుపున న్యాయవాది పిటషన్ దాఖలు చేశారు. ఈరోజు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈరోజు లేక రేపు బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తి ఎదుట ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు.
ఇవి కూడా చదవండి...
మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!
ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..
Read Latest AP News And Telugu News