Share News

Supreme Court: చంద్రబాబు కేసులు సీబీఐకి బదిలీపై సుప్రీం ఆగ్రహం

ABN , Publish Date - Jan 28 , 2025 | 12:26 PM

Supreme Court: చంద్రబాబు పిటిషన్లను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదో పనికిమాలిన కేసు అంటూ ఫైర్ అయ్యింది. పిటిషనర్ తరపు న్యాయవాదిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు.

Supreme Court: చంద్రబాబు కేసులు సీబీఐకి బదిలీపై సుప్రీం ఆగ్రహం
Chandrababu Cases Supreme Court

న్యూఢిల్లీ, జనవరి 28: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కేసులను సీబీఐకి (CBI) బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. పిటిషన్ వేసిన బాలయ్య తరపు లాయర్‌పై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పనికిమాలని పిటిషన్‌ అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై ఒక్కమాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. ఈ పిటిషన్‌‌పై వాదించడానికి ఎలా వచ్చారని లాయర్ మహేంద్రసింగ్‌ను జస్టిస్ త్రివేది ప్రశ్నించారు.


ఏపీ సీఎం చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని, ఆయన ప్రస్తుతం సీఎంగా ఉన్నారని కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఒక్క మాట కూడా వినకుండానే ఈ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇది పూర్తిగా పనికిమాలిన పిటిషన్ అంటూ జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఐడీ నమోదు చేసిన ఏడు కేసులు సీబీఐకి బదిలీ చేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాది బీ బాలయ్య పిటిషన్ దాఖలు చేశారు. బాలయ్య తరపున సీనియర్ లాయర్ మహేందర్ సింగ్ వాదనలు వినిపించేందుకు ముందుకు రాగా.. ఆయనపై కూడా జస్టిస్ త్రివేది తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమాన విధిస్తామని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను వాదించేందుకు మీలాంటి సీనియర్ న్యాయవాది ఎలా వచ్చారని కూడా ప్రశ్నించారు. వెంటనే ఆ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.


ఇవి కూడా చదవండి...

‘భరోసా’ పడిందోచ్..

TDP on Tulasibabu: ఆ ఆరోపణల్లో నిజం లేదు.. తులసిబాబు వ్యవహారంపై టీడీపీ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 04:00 PM