YS Sharmila: గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళన పట్టించుకోరా: వైఎస్ షర్మిల
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:32 PM
YS Sharmila: గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులకు అండగా ఉంటామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు. గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు.అభ్యర్థులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని షర్మిల డిమాండ్ చేశారు.

విజయవాడ: గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) డిమాండ్ చేశారు. గ్రూప్-2 మెయిన్స్‌కు అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల తరుపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇవాళ(శుక్రవారం) విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ... 2023 డిసెంబర్ 11వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వైఎస్ షర్మిల చెప్పారు.
ALSO READ: Rammohan Naidu: ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్రం నిర్ణయం ఇదే..
తప్పులను సరిదిద్దాలి..
తప్పులను సరిదిద్దకుంటే నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని అభ్యర్థులు చెబుతున్నారని తెలిపారు. రోస్టర్ విధానంలో తప్పుల తడకతో ఝార్ఖండ్‌లో నోటిఫికేషన్ రద్దయ్యిందని గుర్తుచేశారు. ఉద్యోగాలు పోయే పరిస్థితులు ఏపీలో కూడా ఎదురవుతాయని అభ్యర్థులు భయపడుతున్నారని వైఎస్ షర్మిల చెప్పారు.
అభ్యర్థులతో చర్చించాలి..
తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. హడావిడిగా ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ ఎందుకు మొండిగా వ్యవహారించాల్సిన పరిస్థితి ఉందని ప్రశ్నించారు. ఏపీ వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని వైఎస్ షర్మిల నిలదీశారు. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశం, మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని అన్నారు. ఆందోళనలో ఉన్న మెయిన్స్ అభ్యర్థులను పిలిచి ప్రభుత్వం వెంటనే చర్చించాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Minister Kollu Ravindra: జగన్ డ్రామాలను ప్రజలు ఛీకొడుతున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర విసుర్లు
Viveka Case: వివేకా హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ
Vamshi Case: మళ్లీ సమయం కోరిన పోలీసులు.. వంశీ న్యాయవాదుల అభ్యంతరం
Read Latest AP News And Telugu News