Share News

Deputy CM Pawan Kalyan : అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డుల్లో బ్యాలెన్స్‌ అదృశ్యం

ABN , Publish Date - Jan 26 , 2025 | 05:02 AM

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డ్‌ల గడువు ముగిసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్‌ నిద్రాణ ఖాతాల్లోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగించే అంశమని...

Deputy CM Pawan Kalyan  : అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డుల్లో బ్యాలెన్స్‌ అదృశ్యం

  • వినియోగదారులకు తీవ్ర నష్టం

  • కస్టమర్ల ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి

  • నష్టాల నుంచి రక్షణ కల్పించాలి

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందన

అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డ్‌ల గడువు ముగిసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్‌ నిద్రాణ ఖాతాల్లోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగించే అంశమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆ గిఫ్ట్‌ కార్డ్‌ వినియోగదారుల ఫిర్యాదులు కొన్ని తన దృష్టికి వచ్చాయని ఎక్స్‌ వేదికగా ఆయన తెలిపారు. తన ఆఫీసు కూడా గడువు ముగిసిన బహుమతి కార్డుల నుంచి కోల్పోయిన బ్యాలెన్స్‌ల సమస్యను ఎదుర్కొందన్నారు. చాలా మంది వినియోగదారులు కష్టపడి సంపాదించిన డబ్బు.. ఎటువంటి సహాయం, సమాచారం లేకుండా అదృశ్యమవుతోందన్నారు. 295 మిలియన్లకు పైగా భారతీయులు ఇ- కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లను చురుకుగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఒక బిలియన్‌ గిఫ్ట్‌ కార్డులు అమెజాన్‌ ఇండియాలోనే కొనుగోలు చేశారని తెలిపారు. ప్రీపెయిడ్‌ చెల్లింపు సాధనాలపై ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం అన్ని పీపీఐలు తప్పనిసరిగా కనీసం ఒక ఏడాది చెల్లుబాటును కలిగి ఉండాలని గుర్తుచేశారు. ఒక సంవత్సరం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లయితే, ఖాతాని ముందస్తు నోటీసు తర్వాత మాత్రమే డియాక్టివేట్‌ చేయాలన్నారు. మిగిలిన బ్యాలెన్స్‌ను గిఫ్ట్‌ కార్డు కొనుగోలు చేసిన సమయంలో కేవైసీ లింక్డ్‌ బ్యాంక్‌ ఖాతాకు బదిలీ చేయాలన్నారు. నష్టాల నుంచి వినియోగదారులకు కాపాడేందుకు అన్ని ప్లాట్‌ఫామ్‌లు పారదర్శకంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..


Updated Date - Jan 26 , 2025 | 05:02 AM