Share News

విశాఖపట్నం : కొన్ని గంటల్లో.. రైల్వేకు 18వ జోన్..ఏయే డివిజన్లు ఉంటాయి?

ABN , Publish Date - Jan 08 , 2025 | 10:18 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ మరికొద్ది గంటల్లో నిజం కాబోతోంది. విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని పోరాడుతున్న ఏపీ వాసుల చిరకాల వాంఛ నెరవేరే సమయం దగ్గరపడింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వేజోన్‌తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేస్తున్నారు.

విశాఖపట్నం : కొన్ని గంటల్లో.. రైల్వేకు 18వ జోన్..ఏయే డివిజన్లు ఉంటాయి?
Visakhapatnam Railway Zone

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ మరికొద్ది గంటల్లో నిజం కాబోతోంది. విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని పోరాడుతున్న ఏపీ వాసుల చిరకాల వాంఛ నెరవేరే సమయం దగ్గరపడింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వేజోన్‌తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేస్తున్నారు. బుధవారం (జనవరి 8న) వైజాగ్‌లో కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే (ఎస్‌కోఆర్) ప్రధాన కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి జాతికి అంకితమివ్వనున్నారు. జగన్ పాలనలో విధ్వంసానికి గురై అడుగంటిన ఆర్థికా అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఈ ప్రాజెక్టులు శ్రీకారం చుట్టనున్నాయి. ఆర్థికంగా చతికిలపడిన నవ్యాంధ్ర తిరిగి పుంజుకునేలా అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విశాఖలో భారీ బహింగ సభ నిర్వహిస్తోంది రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం.


విశాఖలో రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని ఏళ్ల పోరాడుతున్న ఏపీ ప్రజలకు చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఇంకొద్ది గంటల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో రూ.149 కోట్ల విలువైన కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే (S CoR) ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు అనకాపల్లి జిల్లాలో పూడిమడక దగ్గర ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్, నక్కపల్లి దగ్గర బల్క్‌డ్రగ్‌ పార్క్‌, కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్, 3 రైల్వే లైన్లు, 6 రైల్వే ప్రాజెక్టులు, 10 రోడ్డు నిర్మాణం, విస్తరణ ప్రాజెక్టులు, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా క్రిస్‌సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు.


ఈ డివిజన్లు కొత్త జోన్‌లోనే ఉంటాయి

ప్రస్తుతం ఉన్న గుంతకల్, గుంటూరు , విజయవాడ డివిజన్లు కొత్త జోన్ సౌత్ కోస్ట్ రైల్వే (ScoR)లో చేర్చబడతాయి. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించే అవకాశం ఉంది.. వాల్తేరు డివిజన్‌లోని కొంత భాగం కొత్త జోన్‌లో అంటే సౌత్ కోస్ట్ రైల్వేలో చేర్చబడుతుంది. అంటే పొరుగున ఉన్న విజయవాడ డివిజన్‌లో విలీనం చేయబడుతుంది. వాల్తేరు డివిజన్‌లోని మిగిలిన భాగం ఒరిస్సా రాయగఢ్‌లోని ప్రధాన కార్యాలయం ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) కింద కొత్త డివిజన్‌గా మార్చబడుతుంది.

Updated Date - Jan 08 , 2025 | 10:59 AM