Actor Vijay: నెల తిరక్కమునుపే జిల్లా నేతలపై చర్యలు..
ABN , Publish Date - Feb 22 , 2025 | 08:45 AM
తమిళగ వెట్రికళగం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నియమితులైన జల్లా కార్యదర్శులపై నెల రోజుల్లోనే ఆరోపణలు రావటంతో వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టేందుకు ఆ పార్టీ నేత, నటుడు విజయ్(Actor Vijay) సిద్ధమవుతున్నారు.

- టీవీకే ఆదవ్ అర్జునకు కొత్త బాధ్యతలు
చెన్నై: తమిళగ వెట్రికళగం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నియమితులైన జల్లా కార్యదర్శులపై నెల రోజుల్లోనే ఆరోపణలు రావటంతో వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టేందుకు ఆ పార్టీ నేత, నటుడు విజయ్(Actor Vijay) సిద్ధమవుతున్నారు. ఆరోపణలు వచ్చిన జిల్లా కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలనిఇటీవలే పార్టీలో చేరిన ఆదవ్ అర్జున్‌కు అప్పగించారు. పార్టీ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా విజయ్ జిల్లా శాఖ నాయకులను నియమించారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: ప్రేమించలేదని టీచర్ కిడ్నాప్..
వీరందరిని వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండే ప్రచారం చేయాలని, జిల్లా , నగరస్థాయిలో పార్టీని బలపరిచేందుకు కూడా పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. వీరి నియామకాలు జరిగి నెల రోజులు కూడా కాకముందే కొందరు జిల్లా కార్యదర్శులు నగర, పట్టణ స్థాయి పదవులను అమ్ముకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. మరికొంతమంది జిల్లా శాఖ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉన్నట్లుగా పార్టీ శ్రేణులతో వ్యవహరిస్తున్నారని గుర్తించారు. ఇంకొంతమంది ఇంటిపట్టునే ఉంటున్నారని తెలుసుకున్నారు. ఇలా సుమారు 20 శాతానికి పైగా జిల్లాశాఖ కార్యదర్శులపై ఆరోపణలు రావటంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయ్ నిర్ణయించారు.
ఈవ్యవహరం పై దృష్టిసారించి చర్యలు చేపట్టే బాధ్యతలను ఆదవ్ అర్జునాకు ఆయన అప్పగించారు. దీంతో యేళ్ల తరబడి విజయ్ అభిమాన సంఘాల నాయకులుగా ఉంటూ ఇటీవల జిల్లా శాఖ పదవులు పొందిన పలువురు తమపై ఆదవ్ అర్జునా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆదవ్ అర్జునా జిల్లా స్థాయిలో పార్టీని అభివృద్ధి పరిచేదిశగా ఆరోపణలకు గురైన నేతలను తొలగించి కొత్తవారిని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే పనిచేయని జిల్లా నేతల తొలగింపుల పర్వం ప్రారంభమవుతుందని తమిళగ వెట్రి కళగం నేతలు చెబుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News