Delhi Election Result: అవినీతిపై సిట్... పర్వేష్ వర్మ సంచలన ప్రకటన
ABN , Publish Date - Feb 08 , 2025 | 06:55 PM
న్యూఢిల్లీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై 4,000 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించడంతో పాటు పార్టీ 48 సీట్లు కైవసం చేసుకోవడంపై మీడియాతో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో 'సిట్' ఏర్పాటు ఒకటని చెప్పారు.

న్యూఢిల్లీ: ఆప్ అద్మీ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు 'సిట్' ఏర్పాటు చేస్తామని బీజేపీ సీనియర్ నేత పర్వేష్ వర్మ (Parvesh Verma) తెలిపారు. న్యూఢిల్లీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై 4,000 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించడంతో పాటు పార్టీ 48 సీట్లు కైవసం చేసుకోవడంపై మీడియాతో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో 'సిట్' ఏర్పాటు ఒకటని చెప్పారు.
Delhi Election Results: బీజేపీ క్లీన్ స్వీప్.. 48 స్థానాలతో విజయకేతనం
సీఎం ఎవరంటే..
పార్టీ ఎమ్మెల్యలతో సంప్రదించి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా పర్వేష్ వర్మ తెలిపారు. పార్టీ నిర్ణయం అందరికీ శిరోధార్యమని చెప్పారు. పార్టీ నాయకత్వం, ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లే ఢిల్లీలో బీజేపీ ఘనవిజయం సాధించిందని అన్నారు. ఢిల్లీ ఓటర్లు, లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, మోదీ కృషి వల్లే గెలుపు సాకారమైందని తెలిపారు. పార్టీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా విస్తృత ప్రచారం సాగించి కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని నింపారని ప్రశంసించారు. ఈ విజయం ప్రతి ఒక్కరి విజయమని అబివర్ణించారు.
ప్రాధాన్యతా క్రమాలు..
మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, ప్రభత్వ అవినీతిపై సిట్ ఏర్పాటు, యువనా రివర్ ఫ్రెంట్, కాలుష్యం తగ్గించడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటివి ప్రభుత్వ ప్రాధాన్యతాక్రమాలుగా ఉంటాయని, అందరూ గర్వించదగిన రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని చెప్పారు. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..