Sports Meet: ఉత్సాహభరితంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్
ABN, Publish Date - Mar 19 , 2025 | 07:31 AM
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడల్లో భాగంగా క్రికెట్ పోటీలను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సరదాగా కాసేపు ఆయన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. హోంమంత్రి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరై క్రికెట్ ఆడారు.

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడల్లో భాగంగా క్రికెట్ పోటీలను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సరదాగా కాసేపు ఆయన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. హోంమంత్రి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరై క్రికెట్ ఆడారు.

మహిళల టగ్ ఆఫ్ వార్ పోటీలో గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత జట్లు తలపడగా... గుమ్మిడి సంధ్యారాణి జట్టు గెలిచింది.

శాసనసభ్యులకు ఆటలు కొత్తవి కావు..రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసేవలో ఉండటం వల్ల ఆటలకు సమయం కేటాయించలేకపోతారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రడు తెలిపారు.

అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం వారి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇందిరాగాంధీ స్టేడియంలో మూడు రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రడు పేర్కొన్నారు.

పురుషుల టగ్ ఆఫ్ వార్ పోటీలో మొత్తం నాలుగు జట్లు తలపడ్డాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రఘురామకృష్ణరాజు జట్లు గెలుపొందాయి.

కబడ్డిలో అయ్యన్న, అచ్చెన్న జట్లు పోటీపడగా... అచ్చెన్న జట్టు గెలిచింది.

వాలీబాల్‌లో అయ్యన్న జట్టు, త్రోబాల్‌లో భూమా అఖిల ప్రియ జట్టు గెలిచాయి.

ప్రతి ఒక్కరిలోనూ క్రీడాస్ఫూర్తి ఉండాలని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇలాంటి క్రీడా పోటీల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనడం వల్ల నియోజకవర్గాల్లో క్రీడలను ప్రోత్సహించే అవకాశం వస్తుందని రఘురామకృష్ణరాజు తెలిపారు.

క్రీడలకు పూర్వవైభవం తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నారు.
Updated at - Mar 19 , 2025 | 08:45 AM