Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న గుర్రాన్ని.. 20 సెకన్లలో కనుక్కుంటే.. మీకు కంటి సమస్యలు లేనట్లే..
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:30 PM
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఏనుగు పెద్ద మొద్దులను మోసుకుంటూ వెళ్లి ఒకచోట పడేస్తుంటుంది. ఆ ఏనుగు వెనుక ఉన్న విశాలమైన ప్రాంతంలో ఓ ఇల్లు కూడా ఉంటుంది. అయితే ఇదే చిత్రంలో ఓ గుర్రం కూడా దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి ..

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చూసేందుకు ఎంత ఆసక్తిని కలిగిస్తాయో.. కొన్నిసార్లు అంతే ఆశ్చర్యకరంగా కూడా అనిపిస్తుంటాయి. పైకి మామూలు ఫొటోల్లోగా కనిపించినా.. అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఎంత సేపు గమనించినా అందులో ఎలాంటి తేడాలూ కనిపించవు. అయితే కాస్త తీక్షణంగా చూస్తే మాత్రం.. వాటిలోని పజిల్స్‌ను పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. సోషల్ మీడియాలో ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేకం కనిపిస్తుంటాయి. తాజాగా, మీ కోసం ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న ఏనుగు చిత్రంలో దాక్కున్న గుర్రాన్ని 20 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఏనుగు (Elephant) పెద్ద మొద్దులను మోసుకుంటూ వెళ్లి ఒకచోట పడేస్తుంటుంది. ఆ ఏనుగు వెనుక ఉన్న విశాలమైన ప్రాంతంలో ఓ ఇల్లు కూడా ఉంటుంది.
ఆ పక్కనే చెట్ల పొదలను కూడా చూడొచ్చు. ఇక్కడ ఏనుగు, ఇల్లు, ఆకాశం, మేఘాలు, చెట్ల పొదలు తప్ప ఇంకే వస్తవు కానీ.. జంతువు కానీ కనిపించదు. అయితే మీకు తెలీని విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో (Hidden Horse) ఓ గుర్రం కూడా దాగి ఉంది. అయితే ఆ గుర్రాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు.
Optical illusion: మీలో పరిశీలనా సామర్థ్యం ఉంటే.. ఈ చిత్రంలో తప్పు ఏంటో చెప్పండి చూద్దాం..
మీ దృష్టిని ఈ చిత్రంపైనే నిలిపి, కాస్త లాజిక్‌గా ఆలోచిస్తే.. ఆ గుర్రాన్ని ఎంతో సులభంగా గుర్తించవచ్చు. ఎంతోమంది ఆ గుర్రాన్ని కనిపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ గుర్రం ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ గుర్రాన్ని గుర్తించలేకపోతుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..