Funny Viral Video: ఇది బీహార్ కటింగ్ స్టైల్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Feb 27 , 2025 | 08:02 AM
విషాదం, వింతలు, సంతోషం.. ఇలా సందర్భం ఏదైనా ఆ వెంటనే అది వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది..

విషాదం, వింతలు, సంతోషం.. ఇలా సందర్భం ఏదైనా ఆ వెంటనే అది వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తికి హెయిర్ కటింగ్ చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇది బీహార్ కటింగ్ స్టైల్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా కటింగ్ చేసే వారు ప్రాంతాన్ని బట్టి డబ్బులు తీసుకుంటుంటారు. పట్టణాలు, నగరాల్లో అయితే అత్యాధునిక సెలూన్లలో కటింగ్ చేయించుకునేందుకు వందలు, వేలు చెల్లించాల్సి వస్తుంటుంది. దీంతో కొందరు ఖర్చులు తగ్గించుకునేందుకు చిన్న చిన్న సెలూన్లకు వెళ్తుంటారు. అయితే ఓ వ్యక్తికి ఆ డబ్బు కూడా చెల్లించకుండా ఫ్రీగా చేయాలని అనుకున్నాడు.
Viral Video: ఎంతకు దిగజారిపోయార్రా.. వీళ్లు చోరీ చేస్తున్నదేంటో చూస్తే.. నోరెళ్లబెడతారు..
సిమెంట్ పని చేస్తున్న ఆ వ్యక్తి.. తన సోదరుడికి ఫ్రీగా కటింగ్ చేసేందుకు వింత టెక్నిక్ ఉపయోగించాడు. తన చేతిలోని తాపీనే కత్తెరగా వాడేశాడు. కొందరు వ్యక్తులు బాలుడిని నేలపై పడుకోబెట్టి, బలవంతంగా పట్టుకుని ఉండగా.. ఆ వ్యక్తి తన చేతిలోని తాపీతో (Hair cutting with thapi) వెంట్రుకలను నేలపై పెట్టి, దానిపై బలంగా కొట్టాడు. ఇలా వెంట్రుకలన్నింటినీ ఒకే సైజులో తాపీతో కట్ చేస్తూ వచ్చాడు. ఆ సమయంలో బాలుడు విడిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా.. వారు మాత్రం ఏమాత్రం వినిపించుకోకుండా బలవంతంగా కటింగ్ చేసేశారు.
Viral Dustbin Video: చెత్తను బంగారం చేశారుగా.. ఈ పెళ్లిలో ఏర్పాట్లు చూస్తే శభాష్ అనాల్సిందే..
ఇలా తన చేతిలోని తాపీతో కటింగ్‌ను ఫ్రీగా చేసేశాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఐడియా ఏదో బాగుందే’’.. అంటూ కొందరు, ‘‘ఇది చూస్తుంటే మా చిన్నప్పటి జ్ఞాపకలు గుర్తుకొస్తున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 46 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..