Afghanistan: ఇంగ్లండ్‌పై ఆఫ్ఘాన్ ఆశలు.. సెమీస్ చేరాలంటే సంచలనం జరగాలి
ABN , Publish Date - Mar 01 , 2025 | 02:04 PM
ENG vs SA: చాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీస్ చేరే జట్లపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ నాకౌట్‌కు క్వాలిఫై అయ్యాయి. గ్రూప్-బీ నుంచి ఒక్క ఆస్ట్రేలియా మాత్రం బెర్త్ ఖాయం చేసుకుంది. ఇంకో టీమ్ ఏది అనేది? ఇంకా స్పష్టత రాలేదు.

చాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్ స్టేజ్ మ్యాచులు దాదాపుగా ముగిశాయి. ఇంకా రెండు మ్యాచులు మాత్రమే జరగాల్సి ఉంది. దీంతో అభిమానుల ఫోకస్ సెమీఫైనల్స్‌పై షిఫ్ట్ అవుతోంది. అయితే నాకౌట్ బెర్త్‌ల మీద ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు. గ్రూప్-ఏ నుంచి టీమిండియా, న్యూజిలాండ్ క్వాలిఫై అయ్యాయి. కానీ గ్రూప్-బీ నుంచి ఒక్క ఆసీస్ మాత్రమే సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. సౌతాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య ఇవాళ జరిగే కీలక పోరుతో మరో నాకౌట్ బెర్త్ మీద స్పష్టత రానుంది. ఈ తరుణంలో ఇంగ్లీష్ టీమ్ సంచలనం సృష్టించాలని కోరుకుంటోంది ఆఫ్ఘానిస్థాన్.
సంచలనం జరిగేనా..
ప్రొటీస్‌ను ఇంగ్లండ్ భారీ తేడాతో ఓడించాలని ఆఫ్ఘాన్ కోరుకుంటోంది. ఏకంగా 207 పరుగుల తేడాతో మట్టికరిపించాలని వేడుకుంటోంది. దీనికి కారణం ఆఫ్ఘానిస్థాన్ నాకౌట్ ఆశలు ఇంకా సజీవంగా ఉండటమే. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఆ టీమ్ సెమీస్ చాన్సులు దాదాపుగా ముగిసిపోయాయి. అయితే ఒకవేళ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బట్లర్ సేన బిగ్ విక్టరీ కొడితే ఆఫ్ఘాన్‌కు నాకౌట్ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 300 పైచిలుకు స్కోరు బాదాలి. ఆ తర్వాత ప్రొటీస్‌ను 207 పరుగుల తేడాతో ఓడించాలి. ఇవాళ్టి మ్యాచ్‌లో ఒకవేళ ఇంగ్లండ్ చేజింగ్ చేయాల్సి వస్తే 300 ప్లస్ టార్గెట్‌ను 11.1 ఓవర్లలోనే అందుకోవాలి. ఒకవేళ సౌతాఫ్రికా గనుక ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా ఫస్ట్ ప్లేస్‌తో సెమీస్‌కు క్వాలిఫై అవుతుంది. మరి.. ఏ జట్టు నాకౌట్‌కు చేరుకుంటుందో చూడాలి.
ఇవీ చదవండి:
ఒంటికాలిపై సిక్సులు.. ధోని ప్రిపరేషన్ మామూలుగా లేదు
రోహిత్‌తో పాటు అతడు మిస్.. ప్లేయింగ్ 11 ఇదే..
డబ్బుతో సంబంధం లేదు.. అందరూ ఆడొచ్చు!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి