Share News

Rishabh Pant: అన్నీ వాళ్లకు చెప్పి చేయాలా.. రిషబ్ పంత్ సీరియస్

ABN , Publish Date - Jan 24 , 2025 | 04:27 PM

Team India: ఆస్ట్రేలియా టూర్ తర్వాత భారత జట్టును పలు వివాదాలు కమ్మేశాయి. డ్రెస్సింగ్ రూమ్ కాంట్రవర్సీతో పాటు కెప్టెన్సీ మార్పు లాంటి పలు అంశాలు టీమిండియా ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్‌ గురించి అందరూ చర్చించుకునేలా చేశాయి. తాజాగా ఈ అంశంపై పించ్ హిట్టర్ రిషబ్ పంత్ స్పందించాడు.

Rishabh Pant: అన్నీ వాళ్లకు చెప్పి చేయాలా.. రిషబ్ పంత్ సీరియస్
Rishabh Pant

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసినప్పటి నుంచి భారత జట్టును పలు వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ కాంట్రవర్సీతో పాటు సారథ్య మార్పు, సీనియర్ల రిటైర్మెంట్ లాంటి అంశాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఆట కంటే వివాదాల మీద ఎక్కువగా డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. తాజాగా ఈ అంశం మీద టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ రియాక్ట్ అయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం మాట్లాడతామనేది ఆ జట్టు అంతర్గత విషయమని.. సంభాషించుకునే ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు.


ప్రతిదీ చెప్పాలా?

వచ్చే ఐపీఎల్‌లో లక్నో సూపర్ జియాంట్స్‌ను సారథిగా ముందుండి నడిపించనున్నాడు పంత్. మెగా ఆక్షన్‌లో రూ.27 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన పంత్.. అటు బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా.. ఇటు కెప్టెన్‌గానూ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాష్ రిచ్ లీగ్‌కు మరో నెలన్నర కంటే ఎక్కువ సమయం లేదు. ఈ నేపథ్యంలో నెట్టింట వచ్చే ట్రోలింగ్, క్రిటిసిజమ్ వాటిపై పంత్ తాజాగా స్పందించాడు. టీమ్ మీటింగ్స్‌లో చాలా విషయాలు మాట్లాడుకుంటామని.. అయితే బరిలోకి దిగితే ప్రతి ప్లేయర్‌కు సారథిగా అండగా ఉంటానన్నాడు. ఆటగాళ్లను ట్రోలింగ్ నుంచి కాపాడాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రతిదీ ప్లేయర్లతో చెప్పి చేయాల్సిన అవసరం లేదన్నాడు పంత్.


పని మీదే ఫోకస్!

డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు రాకుండా చూడాల్సిన అవసరం ఉందంటూ ఇన్‌డైరెక్ట్‌గా టీమిండియా కాంట్రవర్సీని గుర్తుచేశాడు పంత్. ప్రతిదీ అందరికీ చెప్పి చేయాల్సిన అవసరం లేదంటూ విమర్శకులకు ఇచ్చిపడేశాడు. ప్లేయర్‌గా 200 శాతం తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. మ్యాచ్ కండీషన్స్‌కు తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నిస్తానని.. టీమ్ విజయాల్లో తన భాగస్వామ్యం ఉందా? లేదా? అని చూసుకుంటూ ఉంటానని స్పష్టం చేశాడు స్టార్ బ్యాటర్. టీమిండియా కెప్టెన్సీ గురించి తాను ఆలోచించడం లేదన్నాడు. చేయాల్సిన పని మీదే ధ్యాస పెడతానని.. ఫలితం దానంతట అదే వస్తుందని వివరించాడు పంత్.


ఇవీ చదవండి:

భారత్‌ను రెచ్చగొడుతున్న ఆర్చర్

పాత రోహిత్ జస్ట్ వచ్చి వెళ్లాడు..

14,505 బంతులతో ఎంసీఏ గిన్నిస్‌ రికార్డు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 24 , 2025 | 04:31 PM