Share News

Rohit Sharma: మనసులు గెలుచుకున్న రోహిత్.. నువ్వు గ్రేట్ బాస్

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:43 PM

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఒకే ఒక్క పనితో అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్‌తో శభాష్ అనిపించుకుంటున్నాడు.

Rohit Sharma: మనసులు గెలుచుకున్న రోహిత్.. నువ్వు గ్రేట్ బాస్
Rohit Sharma

వాంఖడే స్టేడియం 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమానికి లెజెండ్స్ సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌, డయానా ఎడుల్జీతో పాటు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తదితరులు అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్‌లో ప్రత్యేకంగా పోస్టల్ స్టాంప్‌ను రిలీజ్ చేశారు. గవాస్కర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అలరించాడు. ఈ ప్రోగ్రామ్‌కు భారత జట్టు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ అజింక్యా రహానె కూడా హాజరయ్యారు. ఆద్యంతం ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో ఒక్క పనితో రోహిత్ అందరి హృదయాలు గెలుచుకున్నాడు. దాన్ని చూసిన వారంతా.. నువ్వు గ్రేట్ బాస్ అని మెచ్చుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


రవిశాస్త్రి పిలిచినా..!

వాంఖడే స్టేడియం వార్షికోత్సవాల ముగింపు వేడుకల సమయంలో స్టేజ్ మీద దిగ్గజ క్రికెటర్లంతా కూర్చున్నారు. ఆ గ్రౌండ్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. అయితే సభా వేదిక మీద అతిథులు కూర్చునే సమయంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్టేజ్‌పై కుర్చీలను కాస్త దూరంగా మూడు వైపులా వేశారు. రోహిత్ అక్కడికి వచ్చేసరికి సచిన్, గవాస్కర్, ఎడుల్జీ, రవిశాస్త్రి కూర్చొని ఉన్నారు. సభా వేదిక మీదకు వస్తున్న హిట్‌మ్యాన్‌ను చూసి తన పక్కన ఉన్న సీట్లోకి రావాల్సిందిగా రవిశాస్త్రి సూచించాడు.


నీ మనసు బంగారం!

రవిశాస్త్రి సూచించిన చోట రోహిత్ కూర్చోలేదు. స్టేజ్ మధ్యలో రెండు కుర్చీలు ఖాళీగా ఉండటంతో అక్కడ కూర్చుందాం పదా అంటూ రవిశాస్త్రిని అతడు తీసుకెళ్లాడు. రవిశాస్త్రిని మధ్యలో కూర్చోబెట్టి పక్కన హిట్‌మ్యాన్ కూర్చున్నాడు. ఇది చూసిన నెటిజన్స్.. రోహిత్ మనసు బంగారం అని మెచ్చుకుంటున్నారు. తాను స్టార్‌ని, టీమిండియా కెప్టెన్ అనే విషయాన్ని పక్కనపెట్టేసి.. మాజీ కోచ్‌ను మధ్యలో కూర్చోబెట్టడం, అతడికి గౌరవం ఇవ్వడం హైలైట్ అని ప్రశంసిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి అతడు బెస్ట్ ఎగ్జాంపుల్ అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. పెద్దలకు గౌరవం ఎలా ఇవ్వాలో రోహిత్ నుంచి నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

కెప్టెన్‌గా పంత్.. కప్పు కొట్టేలా ఉన్నారే

బుమ్రాకు సారీ చెప్పిన స్టార్ సింగర్

నాతో ఆడుకున్నాడు: సచిన్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 20 , 2025 | 04:43 PM