Share News

Shreyas Iyer: వాళ్ల రుణం తీర్చుకుంటా.. అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 13 , 2025 | 10:03 AM

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు జోరు మీద ఉన్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడిన ప్రతి టోర్నమెంట్‌లోనూ పరుగుల వరద పారిస్తూ పోతున్నాడు. భారత జట్టులో పర్మినెంట్ బెర్త్ సంపాదించడమే టార్గెట్‌గా బ్యాట్‌తో గర్జిస్తున్నాడు.

Shreyas Iyer: వాళ్ల రుణం తీర్చుకుంటా.. అయ్యర్ ఇంట్రెస్టింగ్  కామెంట్స్
Shreyas Iyer

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు జోరు మీద ఉన్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడిన ప్రతి టోర్నమెంట్‌లోనూ పరుగుల వరద పారిస్తూ పోతున్నాడు. భారత జట్టులో పర్మినెంట్ బెర్త్ సంపాదించడమే టార్గెట్‌గా బ్యాట్‌తో గర్జిస్తున్నాడు. అప్పట్లో దేశవాళీల్లో ఆడనని చెప్పినందుకు బీసీసీఐ అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేయడం, టెస్టులకు దూరమవడంతో కసితో రగిలిపోతున్న అయ్యర్.. తన కోపాన్నంతా బంతి మీద చూపిస్తున్నాడు. కసి తీరా బాదుతూ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. అలాంటోడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానేంటో చూపిస్తానంటూ వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. అయ్యర్ ఇంకా ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..


నమ్మకం నిలబెట్టుకుంటా!

గత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన అయ్యర్.. ఈసారి పంజాబ్ కింగ్స్ జెర్సీ వేసుకోనున్నాడు. ఇటీవల జరిగిన మెగా ఆక్షన్‌లో అతడ్ని ఏకంగా రూ.26.75 కోట్ల భారీ ధర పెట్టి మరీ కొనుగోలు చేసింది పంజాబ్. అయితే అయ్యర్‌ను కెప్టెన్సీ కోసం తీసుకున్నా అతడికి ఆ పగ్గాలు ఇస్తామని చెప్పలేదు. ఆ విషయాన్ని నాన్చుతూ వచ్చిన పీబీకేఎస్ యాజమాన్యం.. ఎట్టకేలకు ఆదివారం ప్రకటన చేసింది. శ్రేయస్‌ను తమ జట్టు సారథిగా నియమిస్తున్నట్లు పంజాబ్ కింగ్స్ అధికారిక ప్రకటన చేసింది. దీనిపై అయ్యర్ రియాక్ట్ అయ్యాడు. తన మీద ఫ్రాంచైజీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు.


వెయిటింగ్!

‘నా మీద టీమ్ నమ్మకం ఉంచడం గౌరవంగా భావిస్తున్నా. హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలసి మళ్లీ వర్క్ చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. తనను ఇంతగా ఆదరిస్తున్న అభిమానుల రుణం తీర్చుకుంటానని తెలిపాడు. తాను ఏంటో చూపిస్తానని పేర్కొన్నాడు. కాగా, అప్పట్లో పాంటింగ్‌తో కలసి పనిచేశాడు అయ్యర్. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఆ సమయంలో డీసీకి శ్రేయస్ సారథిగా వ్యవహరించాడు. వీళ్లిద్దరి జోడీ సూపర్ హిట్ అయింది. వీళ్ల ఆధ్వర్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ రన్నరప్‌గా నిలిచింది.


ఇవీ చదవండి:

పంత్-జైస్వాల్ మధ్య వార్.. అగ్గిరాజేసింది బీసీసీఐనే..

గ్రామీణ క్రీడకు అంతర్జాతీయ సొబగు

14 ఏళ్ల వయసులోనే ట్రిపుల్ సెంచరీ.. ఈ అమ్మాయి బ్యాటింగ్‌కు ఫిదా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2025 | 10:36 AM