Share News

Team India: బౌలింగ్ రాక్షసుడి ప్రాక్టీస్ షురూ.. భారత్‌కు ఇంకో ఐసీసీ ట్రోఫీ ఖాయం

ABN , Publish Date - Jan 08 , 2025 | 10:32 AM

టీమిండియా బౌలింగ్ రాక్షసుడు ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. భీకర బౌన్సర్లు, సుడులు తిరిగే స్వింగర్లతో నెట్స్‌లో భీకరంగా బౌలింగ్ చేశాడు. వికెట్లను టార్గెట్ చేసుకొని బౌలింగ్ చేస్తూ పోయాడు.

Team India: బౌలింగ్ రాక్షసుడి ప్రాక్టీస్ షురూ.. భారత్‌కు ఇంకో ఐసీసీ ట్రోఫీ ఖాయం
Mohammed Shami

టీమిండియా ప్రధాన బలాల్లో అతనొకడు. బంతి చేతబడితే ప్రత్యర్థిని కుప్పకూల్చే వరకు వదలడు. ఎంత తోపు బ్యాటరైనా అతడి పేస్, స్వింగ్, లైన్ అండ్ లెంగ్త్‌కు దాసోహం అనాల్సిందే. బుల్లెట్ పేస్‌తో అతడు వేసే బౌన్సర్లు, స్వింగర్లకు టాప్ బ్యాటర్స్‌ కూడా తలొంచాల్సిందే. ఈ టాలెంట్‌తో ఏళ్లుగా భారత జట్టుకు మెయిన్ వెపన్‌గా కొనసాగుతున్న ఆ బౌలర్ మరెవరో కాదు.. మహ్మద్ షమి. వన్డే వరల్డ్ కప్-2023లో మెన్ ఇన్ బ్లూ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఏస్ పేసర్.. అదే టోర్నీలో గాయం బారిన పడ్డాడు. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నోడు.. మొత్తానికి కోలుకున్నాడు.


మునుపటి రేంజ్‌లో..

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్న షమి పూర్తిగా రికవర్ అయినట్లే కనిపిస్తున్నాడు. తాజాగా తన ట్రెయినింగ్ వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో మునుపటి స్థాయిలో అదే రిథమ్‌లో బౌలింగ్ చేస్తూ దర్శనమిచ్చాడు. కోచింగ్ బృందం పర్యవేక్షణలో వికెట్లను లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేశాడు. పలుమార్లు స్టంప్స్‌ను పడేశాడు. షమి రనప్, ఫాలో త్రూ, లైన్ అండ్ లెంగ్త్, స్పీడ్ అంతా అద్భుతంగా ఉన్నాయి. ఇంగ్లండ్ సిరీస్‌తో అతడి కమ్‌బ్యాక్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే దీనిపై సెలెక్టర్లు క్లారిటీ ఇస్తే గానీ ఏమీ చెప్పలేం.


ఆ ట్రోఫీ మనదే!

గాయానికి సర్జరీ చేయించుకున్న షమి కోలుకొని చాలా రోజులే అవుతోంది. అయితే మధ్యలో మళ్లీ ఇంజ్యురీ తిరగబెట్టడంతో రెస్ట్ తీసుకున్నాడు. కొన్నాళ్లు బెంగాల్ టీమ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడాడు. కానీ గాయంతో మళ్లీ నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ, ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడం, బౌలింగ్ టెక్నిక్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవడం మీద పనిచేశాడు. గాయం తిరగబెట్టడంతోనే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతడు దూరమయ్యాడు. అయితే అతడి ఊపు చూస్తుంటే చాంపియన్స్ ట్రోఫీ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అతడు టీమ్‌లోకి వస్తే కప్పు మనదేనని అభిమానులు అంటున్నారు. ఫుల్ ఫిట్‌గా కనిపిస్తున్న షమి.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రీఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.


ఇవీ చదవండి:

అర్ష్‌దీప్ స్టన్నింగ్ డెలివరీ.. బ్యాటర్ ఫ్యూజులు ఎగిరాయి

గాయాలతో సహవాసం

షమి పరిస్థితేంటి? ప్రశ్నించిన శాస్త్రి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 08 , 2025 | 10:49 AM