Husband abuses wife.. ఆడపిల్ల పుడుతుందని తెలిసి ఆ భర్త ఏం చేశాడంటే...
ABN , Publish Date - Jan 29 , 2025 | 09:27 AM
ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే.. మహాలక్ష్మి ఉన్నట్టే అని అంటారు.. అమ్మాయి పుడితే.. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనే వారు. తదనంతర కాలంలో అమ్మాయి పుడితే.. ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పులు.. భ్రూణ హత్యలు.. లింగ వివక్ష జరుగుతోంది.తాజాగా ఆడపిల్ల పుడుతుందని తెలిసి ఓ భర్త గర్భవతి అయిన తన భార్యను, పిల్లలను అర్ధరాత్రి పుట్టింటికి పొమ్మని ఇంటి నుంచి గెంటేశాడు.

హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్‌లో దారుణం (Atrocity) జరిగింది. మళ్లీ తనకు ఆడపిల్ల (Girl) పుడుతుందని తెలిసి ఆ భర్త (Husband) కట్టుకున్న భార్య (Wife)ను పుట్టింకి పంపివేశాడు. అర్ధరాత్రి అనే కనికరం లేకుండా గర్బవతినీ, తన ఇద్దరు పిల్లలను పుట్టింకి పొమ్మని బయటపెట్టి తలుపువేశాడు. వివాహ సమయంలో పెట్టిన సామాన్లు సయితం అత్త ఇంటికి పంపించివేశాడు. అర్ధరాత్రి తన ఇద్దరి పిల్లతో రోడ్డు పాలైన నిండు చూలాలు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె అత్తా మామ కూడా కొడుకుకు వత్తాసు పలకడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు హుమేరా బేగం పోలీసులను ఆశ్రయించింది. వివాహం జరిగి నప్పటి నుండి భర్త వేధింపులు మొదలయ్యాయని, మొదటి సారి ఆడపిల్లకు జన్మ నిచ్చిన తరువాత అదనపు కట్నం తేవాలని భర్త అక్బర్ ఖాన్ చిత్ర హింసలకు గురిచేశాడని.. గర్భవతి అయిన రెండు సార్లు పుట్టింకి వెళ్లగొట్టాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వార్త కూడా చదవంటి..
సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..
ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే.. మహాలక్ష్మి ఉన్నట్టే అని అంటారు.. ఒకప్పుడు అమ్మాయి పుడితే.. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందనేవారు. తదనంతర కాలంలో అమ్మాయి పుడితే.. ఆడపిల్ల పుట్టిందా అనే నిట్టూర్పులు.. భ్రూణ హత్యలు.. లింగ వివక్ష జరుగుతోంది. పుట్టాక అడుగడుగునా ఆంక్షలు విధించే వారు. వారిని స్వేచ్ఛా విహంగాల్లా ఎదగనిచ్చే సమాజం అవసరం ఉంది. ఆడ పిల్లలకు అండగా ఉండటంతో పాటు, బాలికల విద్య ప్రాముఖ్యత, వారి ఆరోగ్యం పోషణపై అవగాహన కల్పించడం, లింగ సమానత్వం కోసం 2008 జనవరి 24 నుంచి జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
GSLV F-15 రాకెట్.. ప్రయోగం విజయవంతం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News