Share News

Mahesh Kumar Goud: జిల్లాల పర్యటనకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ABN , Publish Date - Jan 03 , 2025 | 02:40 PM

Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. స్థానిక సంస్థలే లక్ష్యంగా మహేష్ కుమార్ గౌడ్ పర్యటన కొనసాగనుంది. ఈపర్యటనలో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు.

Mahesh Kumar Goud: జిల్లాల పర్యటనకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జిల్లాల పర్యటనకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్లాన్ చేసుకున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు జిల్లాల్లో మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ , కరీంనగర్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నారు.


పదేళ్లు బీసీలను అణగదొక్కారు: మహేష్‌కుమార్‌గౌడ్

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మహేష్‌కుమార్‌గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీసీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని అన్నారు. పదేళ్లు బీసీలను అణగదొక్కి అగ్రవర్ణాలకే అంకితమయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మరని మహేష్‌గౌడ్ అన్నారు. బీసీలకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తనలాంటి సామాన్య కార్యకర్తకు టీపీసీసీ ఇవ్వడంతో పాటు బీసీల డిపార్ట్‌మెంట్‌కు అత్యధిక నిధులు ఇచ్చిందని మహేష్‌గౌడ్ పేర్కొన్నారు.


కాస్మోటిక్ చార్జీలు పెంచాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Ponguleti.jpg

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో కాస్మోటిక్ చార్జీలు పెంచామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కొత్తగూడెం శ్రీ రామచంద్ర కళాశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా రూ. 657 కోట్ల ఖర్చుతో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. కొత్తగూడెం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కోసం రుద్రంపూర్ ప్రాంతంలో సింగరేణి, అటవీ, ప్రైవేట్ భూముల్లో ఫీజుబిలిటి సర్వే చేస్తున్నట్లు ప్రకటించారు.కొత్తగూడెంలో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం కోసం కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్టలల్లో చదువుకున్న పేద విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం కనీసం భోజనం పెట్టలేదని ఆరోపించారు. ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్..

Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..

TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 05:06 PM