Sankranti : బస్సు టికెట్ ధరకే విమాన ప్రయాణం..
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:58 PM
Sankranti :సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రైవేట్ ట్రావెల్స్‌లో సీట్లు దొరికినా భారీ రేట్లతో జేబులు గుల్లయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రైళ్లు, బస్సుల్లో ప్రయాణానికి సుమారు 10నుంచి 14 గంటల సమయం పడుతుండడంతో ..
హైదరాబాద్, జనవరి 10: సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రైవేట్ ట్రావెల్స్‌లో సీట్లు దొరికినా భారీ రేట్లతో జేబులు గుల్లయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రైళ్లు, బస్సుల్లో ప్రయాణానికి సుమారు 10నుంచి 14 గంటల సమయం పడుతుండడంతో కొందరు విమానాలవైపు దృష్టి సారిస్తున్నారు. డిమాండ్ అధికంగా ఉన్న 10,11,12 తేదీల్లో కాకుండా 13వ తేదీన వెళ్లే వారు 1-2 గంటల వ్యవధిలోనే తమ ఊళ్లకు ప్రయాణించేలా విమానయానాన్ని ఎంచుకుంటున్నారు. 13వ తేదీన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలంటే విమానపు టికెట్లు రూ.5వేల నుంచి అందుబాటులో ఉన్నాయి.
అయితే, ఒకరోజు ముందు (12వ తేదీన) ఏసీ స్లీపర్ బస్సుల్లో వెళ్లాలంటే రూ.6 వేల నుంచి 7వేల దాకా డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటోంది. సీటును బట్టి రేట్లను నిర్ణయిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు సంక్రాంతి డిమాండును సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా వైజాగ్ ఒక్కటే కాదు.. రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకు సైతం ఆయా వెబ్‌సైట్‌లలో ఫ్లైట్ టికెట్ల ధరలు తక్కువగా కనిపిస్తున్నాయి. పండగకు వెళ్లేవారు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఏసీ స్లీపర్ బస్సుకు వెచ్చించే చార్జీలతోనే విమానంలో ప్రయాణం చేయవచ్చని ట్రావెలింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
ఫుల్ టు బిందాస్.. ఆ టెన్షన్ వదిలేయండి..
స్పెషల్ ఫ్లైట్లతో కిటకిటలాడిన ఎయిర్‌పోర్ట్
వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
For More Telangana News and Telugu News..