Home » LATEST NEWS
అమెరికా సుంకాల ప్రభావం దృష్టిలో ఉంచుకుని, ఆక్వా రంగ సమస్యలపై ప్రభుత్వంపై కమిటీ ఏర్పాటు చేసింది.ఈ కమిటీ తక్షణ, మధ్య మరియు దీర్ఘకాలిక పరిష్కారాలపై నివేదికలు సమర్పించనుంది.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జగన్‌పై చేసిన తప్పుడు ఆరోపణలు, పోలీసులను దుర్భాషలాడడం, వైసీపీ కేడర్‌ను హింసకు ప్రేరేపించడం వంటి చర్యలు జారిచేయడం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు
జగన్ పత్రికలో తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు సహా పలువురు నేతలు హరీష్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ గెలుపు జోరును కొనసాగిస్తోంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82)తోపాటు బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో...
జనకుల శ్రీనివాసరావు, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు, జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టు చెప్పి, బహిరంగ క్షమాపణలు ఇవ్వాలని హెచ్చరించారు
క్వార్ట్జ్ అక్రమ తవ్వకంపై కేసులో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది
రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ జగన్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చెప్పారు, "పోలీసుల బట్టలు కష్టపడి సంపాదించుకున్నవి, అవి ఊడదీయడం సులభం కాదు
దేశ కాంపౌండ్ ఆర్చర్ల సుదీర్ఘ ఎదురు చూపులు ఫలించాయి. 2028 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీని ప్రవేశపెట్టనున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బుధవారం వెల్లడించింది...
మాజీ మంత్రి జోగి రమేశ్‌ను దాడి కేసులో సీఐడీ విచారణకు పిలిచింది.ఉండవల్లిలో చంద్రబాబు ఇంటిపై దాడి వ్యవహారంపై ఏప్రిల్ 11న హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్వశ్ ఐపీఎల్లో ఇప్పుడు సందడి చేస్తోంది. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్లో ఉందన్న వార్తలకు బలం చేకూరుస్తూ...
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియలో ఒకే వార్త.. రెండు విధాలుగా ప్రచురించడం పట్ల టీడీపీ నత తిరునగరి జోత్స్న మండిపడ్డారు. సమాజంలో ఈ పత్రిక ద్వారా ఎలాంటి విదేష్వాలకు తెర తీస్తున్నారో ఆమె సోదాహరణగా వివరించారు. ఈ విధంగా వ్యవహరించే వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు. సదరు మీడియా చైర్మన్‌కు విలువలున్నాయా అంటూ టీడీపీ నేత టి జోత్స్న సందేహం వ్యక్తం చేశారు.
Pastor Praveen: ప్రవీణ్ పగడాల కేసును ప్రభుత్వం ఎంత సావధానంగా పరిష్కరించిందో ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వివరించారు. ఈ కేసులో భాగంగా వాళ్లు సీసీ కెమెరా ఫుటేజ్ కావాలంటే.. చాలా గంటల పాటు శ్రమించి.. ఆ ఫుటేజ్ ఇచ్చామన్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీసీ ఫుటేజ్ కెమెరా అందజేశామని ఆమె పేర్కొన్నారు. పోస్ట్ మార్టం చేయడానికి దాదాపు 38 గంటలు పట్టిందన్నారు. ఓ బాడీకి 10 గంటలలోపు పోర్ట్ మార్టం నిర్వహిస్తే.. స్పష్టమైన నివేదిక ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కానీ 38 గంటల తర్వాత బాడీ పోస్ట్‌మార్టం జరిగిందని చెప్పారు. దీనిపై నివేదిక ఇవ్వడానికి ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ లోని మధురానగర్‌లో ఓ దొంగ హల్చల్ చేశాడు. లేడీస్ హాస్టల్ లో చొరబడి ఇద్దరు యువతుల ల్యాప్‌టాప్‌లు, విలువైన వస్తువులు చోరీ చేశాడు. చోరీ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో బాధిత యువతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో మళ్లీ వానలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని 9 జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్ లోనూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రజ్యోతి "కార్ అండ్ బైక్ రేస్" లక్కీడిప్‌లో నెల్లూరు సంతపేటకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి జొన్నాదుల కోటేశ్వరరావు కారు గెలుచుకున్నారు. కారు గెలుచుకోవడంతో పట్టరాని ఆనందంలో కోటేశ్వరరావు మునిగిపోయారు.
liquor Scam: మద్యం కుంభకోణం కేసులో మూడో సారి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో కసిరెడ్డిపై పోలీసు అధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. చిన్నవయస్సు నుంచి పెద్దవారి వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో గుండెపోటు మాట వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
Nadendla Manohar Anger: ఢిల్లీలో పౌరసరఫరాల శాఖ దుకాణం సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షాప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు.
ఇద్దరు మైనర్లు అయిన అక్కా చెల్లెళ్లకు ఇవాళ వివాహం జరగనుంది. సమాచారం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు సంఘటన ప్రదేశానికి వెళ్లి మైనర్లకు వివాహం జరపడం చట్ట విరుద్ధమని ఇరు కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా పడింది. అయితే..
Moinabad Party Busted: రంగారెడ్డి జిల్లాలో ముజ్రా పార్టీ చేసుకుంటున్న 21 మంది యువతీ యువకులను ఎస్వీటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమెరికా ఒకప్పుడు అవకాశాల దేశం. స్వేచ్ఛ స్వాతంత్ర్యలకు భూతల స్వర్గం అని చెప్పేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. భూతల నరకంగా మారింది. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే దేశంలో.. జనం ఇప్పుడు బిక్కు బిక్కుమంటున్నారా? వలసదారులే కాదు.. స్థానికులు సైతం భయం భయంగా బతుకుతున్నారా?
అమరావతిలో సీఎం చంద్రబాబు తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. సుమార్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 8.00 నుంచి 8.30 గంటల మధ్య ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు బంధువులు సైతం హాజరుకానున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ సైతం ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
కొండముచ్చును చూస్తే చాలా మంది వణికిపోతారు. ఇంటి ఆవరణలోకి వస్తే బెంబేలెత్తిపోతారు. అటువంటి ఒక కొండముచ్చు మనుషులతో కలిసి జీవిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. రాప్తాడు నియోజకవర్గ పర్యటనలో వైసీపీ అల్లరిమూకలు చేసిన పనికి ఆ పార్టీ నేతలు డిఫెన్స్‌లో పడ్డారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య ఇటీవల హత్యకు గురయ్యారు.
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడినా.. ప్రజలే ముఖ్యమనుకుని ముందుకు కదిలాడు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీల్లో 16 మంది కౌన్సిలర్లు అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం నుంచి వీరు కనిపించడం లేదు. వెంకటగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత నెల 19వ తేదీన తిరుపతి జిల్లా వెంకటేశ్వర్లను 16 మంది కౌన్సిలర్లు కలిశారు.