TDP Protest: అయ్యన్న అరెస్ట్‌కు నిరసనగా పాలకొల్లులో ధర్నా

ABN , First Publish Date - 2022-11-03T12:29:21+05:30 IST

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్‌కు నిరసనగా పాలకొల్లులో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

TDP Protest: అయ్యన్న అరెస్ట్‌కు నిరసనగా పాలకొల్లులో ధర్నా

పశ్చిమగోదావరి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) అరెస్ట్‌కు నిరసనగా పాలకొల్లులో టీడీపీ నేతలు (TDP
leader) ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala ramanaidu) ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీసీలపై అక్రమ కేసులకు నిరసనగా 151 అడుగుల భారీ నల్ల జెండాతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ... జగన్ (YS Jagan mohan reddy) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో బీసీలను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి (Vijayasaireddy), సుబ్బారెడ్డిల పెత్తనాన్ని, దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే అయ్యన్న (Former minister)ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ప్రహరీ గోడ పైనే అయ్యన్నను అక్రమ అరెస్టు చేస్తే, సీబీఐ (CBI)లక్ష కోట్లు దోచుకున్న జగన్‌ను తీహార్ జైలుకి పంపించాలని డిమాండ్ చేశారు. జగన్ (AP CM) నేతృత్వంలో సీఐడీ పోలీసులు స్టువర్టుపురం దొంగల్లా వ్యవహరిస్తున్నారని నిమ్మల రామానాయుడు (TDP MLA) మండిపడ్డారు.

Updated Date - 2022-11-03T12:29:22+05:30 IST