Big Breaking : YSRCPకి రాజీనామా చేసే యోచనలో ఎమ్మెల్యే.. ఇదే జరిగితే..!
ABN , First Publish Date - 2023-01-30T22:05:03+05:30 IST
వైసీపీలో (YSRCP) కీలకంగా ఉన్న ఎమ్మెల్యే (MLA) తన పదవికి రాజీనామా (Resign) చేయాలని భావిస్తున్నారా..?..
అమరావతి/నెల్లూరు : వైసీపీలో (YSRCP) కీలకంగా ఉన్న ఎమ్మెల్యే (MLA) తన పదవికి రాజీనామా (Resign) చేయాలని భావిస్తున్నారా..? వైసీపీ ప్రభుత్వంతో ఆయన విసిగి వేసారిపోయారా..? అధినాయకత్వం తీరుతో రాజీనామా చేసేసి మరీ.. రాజకీయాలకు దూరం కావాలని సన్నాహాలు చేసుకుంటున్నారా..? అంటే తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? వైసీపీపై (YSR Congress) ఎందుకు ఇంతలా అసంతృప్తితో రగిలిపోతున్నారు..? అసలు రాజీనామా ఆలోచన ఆయనకు ఎందుకొచ్చింది అనే విషయాలపై ప్రత్యేక కథనం.
ఇంతకీ ఎవరాయన..?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) గురించి జిల్లా ప్రజలతో పాటు.. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలతో అలా రాజకీయాల్లోకి (AP Politics) వచ్చి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014, 2019లో వైసీపీ (YSR Congress) తరఫున పోటీచేసి నియోజకవర్గంలో తనకెవరూ పోటీలేరన్నట్లుగా జనాల్లో ఎదిగారు. మంత్రివర్గ విస్తరణలో (Jagan Cabinet) కోటంరెడ్డి (Kotam Reddy) పేరు కూడా గట్టిగానే వినిపించింది. ఆయన అభిమానులు, అనుచరులంతా పండుగ చేసుకున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ చివరికి లిస్ట్‌లో పేరు రాలేదు. ఆ తర్వాత జరిగిన ఘటనలన్నీ ఇక అప్రస్తుతం. కోటంరెడ్డి (Kotam Reddy) అధికార పార్టీలో ఉండి కూడా అధికారులు ఫలాన చేయలేదని నిరసన చేపట్టిన దాఖలాలు లెక్కలేనన్ని ఉన్నాయ్. అలా ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చూపే వరకూ అధికారులను పరుగులు పెట్టించేవారు. ఇలా నిత్యం ప్రజలతో మమేకమై ఉన్న కోటంరెడ్డి ఈ మధ్య నిత్యం తన అసంతృప్తి గళం వినిపిస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు.
అసలేం జరిగింది..!?
వైసీపీ అధిష్టానం (YSRCP High Command), ఏపీ ప్రభుత్వంపై (AP Govt) కొన్ని విషయాల్లో కోటంరెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. మీడియా (Media) ముందే ఆ విషయాలన్నీ బయట పెట్టేశారు కూడా. అవన్నీ గతంలో అయితే.. తాజాగా తన ఫోన్ ట్యాప్ (Phone Tapping) చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ (Intelligence) అధికారులపై (Officers) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో ఆరోగ్య శిబిరాల గురించి వివరించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా.. అంతకంటే కొన్ని నిమిషాల ముందే ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఇక్కడే అసలు సీన్ స్టార్ట్ అయ్యింది. ‘నమస్తే సార్’ అని అధికారులు ఎమ్మెల్యేను పలకరించగానే.. ఆగ్రహంతో రగిలిపోయిన కోటంరెడ్డి.. ‘‘ఎందుకు వచ్చారు!? నా ఫోన్ ట్యాప్ చేసి నా సంభాషణ మొత్తం వింటున్నారు కదా! ఇంకేం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చారు? నేనేమైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా? నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు?’’ అని నిలదీశారు. తన ఫోన్ ట్యాప్ చేశారనే విషయం ముందే తెలుసని అన్నారు. అది తెలిసే 11 సిమ్‌లు (Sim Cards) వాడుతున్నానని చెప్పారు. అంతేకాదు.. ప్రెస్‌మీట్‌లో అసలు విషయం డైవర్ట్ అయ్యి.. మొత్తం అంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనే పడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఎమ్మెల్యే ఒక్కరిదే కాదు.. ఈయనతో పాటు అధికారపక్షంలో అనేక మంది ఎమ్మెల్యేల పరిస్థితి (YSRCP MLAs) ఇలానే ఉందని టాక్ నడుస్తోంది.
రాజీనామా రె‘ఢీ’నా..!
ప్రభుత్వంపై అసంతృప్తి, అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్.. వీటన్నింటికీ మించి.. రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ (Nellore Rural) టికెట్ కోటంరెడ్డికి కాకుండా ఆయన సోదరుడికి ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అటు ఆధిపత్య పోరూ వీటికి తోడయ్యింది. ఈ అన్ని విషయాలపై నిశితంగా ఆలోచించిన శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి లోనయ్యారు. కుటుంబంలో చిచ్చుపెట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోందని కోటంరెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో పార్టీ ఆఫీసులో (YSRCP Office) ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో విడివిడిగా సమావేశం అయ్యారు.
ఇప్పటికే.. వందలాది మంది పార్టీ ఆఫీసుకు చేరుకోగా మరింత మంది కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు.. రాజీనామా చేసే యోచనలో కూడా ఉంటారని తెలియవచ్చింది. కార్యకర్తల సమావేశం తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి రాజీనామా చేసేస్తారని సమాచారం. మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి (YS Family) విధేయుడనని.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని కోటంరెడ్డి తీవ్ర ఆవేదన చెందుతున్నారని ముఖ్య అనుచరులు చెబుతున్నారు. సోదరుడికి (Kotam Reddy Brother) రూరల్ సీటు ఇస్తే మాత్రం తాను పోటీ ఎక్కడా చేయనని, రాజకీయాలకు కూడా గుడ్ బాయ్ (Good Bye)చెప్పే యోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
రూరల్‌కు కొత్త ఇంచార్జ్..!
ఈ మధ్య ఏ ఎమ్మెల్యే అయినా పార్టీని ధిక్కరిస్తూ మాట్లాడితే ఆటోమాటిక్‌గా ఆయన్ను పక్కనపెట్టి క్షణాల్లోనే నియోజకవర్గ ఇంచార్జ్‌ను వైసీపీ అధిష్టానం నియమించేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramnarayan Reddy) విషయం ఇదే జరిగింది. ఇప్పుడు కోటంరెడ్డి విషయంలోనూ ఇదే జరుగుతుందని.. ఇప్పటికే నియోజకర్గ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే విషయంలో అధిష్టానం క్లారిటీగా ఉందని తెలియవచ్చింది. నెల్లూరు వైసీపీలో కీలకంగా ఉన్న ఆనం విజయకుమార్‌రెడ్డికి (Anam Vijayakumar reddy) రూరల్ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
ఏం జరుగుతుందో..!
కోటంరెడ్డి రాజీనామా చేస్తే మాత్రం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో (Nellore Politics) వైసీపీ పెద్ద కుదుపే. అంతేకాదు ఇది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్కే అవుతుంది. అధికారపార్టీ, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడమనేది మామూలు విషయం అయితే కాదు. ఈ రాజీనామా తర్వాత ఎంతమంది రాజీనామా చేస్తారో కూడా ఊహకందని పరిస్థితేనని తెలుస్తోంది. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీధర్ రెడ్డి పట్ల అధిష్టానం ఎలా వ్యవహరిస్తుంది..? బుజ్జగిస్తుందా.. లేకుంటే ఆయన రాజీనామా చేసినా సోదరుడు ఉన్నారు కదా అని మిన్నకుండిపోతుందా..? ఒకవేళ కోటంరెడ్డి రాజీనామా చేస్తే ఏ పార్టీలోకి వెళ్తారు.. ఏం చేయబోతున్నారు..? అనేది తెలియాల్సి ఉంది.