AP News: ‘కోడికత్తి ఎంత షార్ప్‌గా ఉంటుందో తెలుసా?’

ABN , First Publish Date - 2023-04-15T19:49:28+05:30 IST

జగన్‌ (CM Jagan)ను కోడి కత్తితో 2018లో హత్యాయత్నం చేసి అంతమొందించాలని చూశారని మాజీ మంత్రి కన్నబాబు (Kannababu) ఆరోపించారు.

AP News: ‘కోడికత్తి ఎంత షార్ప్‌గా ఉంటుందో తెలుసా?’

కాకినాడ: జగన్‌ (CM Jagan)ను కోడి కత్తితో 2018లో హత్యాయత్నం చేసి అంతమొందించాలని చూశారని మాజీ మంత్రి కన్నబాబు (Kannababu) ఆరోపించారు. చంద్రబాబు (Chandrababu) ఎప్పుడైనా కోడికత్తి చూశావా? అని ప్రశ్నించారు. అది ఎంత షార్ప్‌గా ఉంటుందో తెలుసా? అని ప్రశ్నించారు. అంత పదునైన కత్తితో దాడి చేస్తే ఎగతాళిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యాయత్నం జరిగిందని NIA నిర్ధారించిన తర్వాత దానిపై లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం లేదా అని అడుగుతున్నామన్నారు. తీర్పులు ఇవ్వడానికి మీరు ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. ఎల్లో మీడియా రాస్తే చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉండగా సంఘటన జరిగినప్పుడు ఆ ప్రభుత్వానికి బాధ్యత లేదా?, హత్యాయత్నం చేసిన వ్యక్తికి నేర చరిత్ర ఉందని తాము ఆనాడే చెప్పామని గుర్తుచేశారు. NIA ఎప్పుడైనా లోతైన అధ్యయనం చేసామని చెప్పిందా? అని ప్రశ్నించారు.

డీఎల్ రవీంద్రారెడ్డి (DL Ravindra Reddy) రెండు రోజులుగా స్ప్రహ కోల్పోయి మాట్లాడుతున్నాడని విమర్శించారు. భారతి రెడ్డి రాజ్యాంగం అంటారా? రాజకీయాలకు దూరంగా ఉన్న మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నించారు. డీఎస్ రవీంద్రారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని మరొకసారి చెప్పుతున్నామన్నారు. ముఖ్యమంత్రి సతీమణిని పట్టుకుని మీ ఇష్టం వచ్చి నట్టు మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఇదేవిధంగా మీ ఇంట్లో మహిళలపై మాట్లాడితే మీరు ఊరుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి చంద్రబాబే చేయించుకున్నాడని తాము ఎప్పుడైనా అన్నామా? అని గుర్తుచేశారు. తమకు సంస్కారం ఉంది కాబట్టి అలా అనడంలేదన్నారు. ఈరోజు రాజకీయాల్లో ఉండాలంటే చాలా కష్టంగా ఉందని, వ్యక్తిత్వ హసనం జరుగుతుందన్నారు.

Updated Date - 2023-04-15T19:49:28+05:30 IST