Jagan Govt. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2023-09-13T15:52:04+05:30 IST

అమరావతి: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డిల నియామకాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు.

Jagan Govt. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ

అమరావతి: జగన్ ప్రభుత్వానికి (Jagan Govt.) హైకోర్టు (High Court)లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీటీడీ (TTD) ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను (MLA Samineni Udayabhanu), దేశాయ్ నికేతన్ (Desai Niketan), శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy)ల నియామకాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషనర్ తరుపున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ (Jada Shravan Kumar) వాదనలు వినిపించారు. మంచి నడవడిక లేని, అనర్హులను, నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని అన్నారు. దీనిపై జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ప్రభుత్వాన్ని వివరణ కోరింది. శిక్ష ఇంకా విధించని కారణంగా వారు నేరస్థులుగా పరిగణించలేదన్న ప్రభుత్వం తరుపు న్యాయవాది వివరణ ఇచ్చారు.

ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఇండియా సభ్యత్వం నుంచి తొలగింప బడిన కేథన్ దేశాయ్‌ను టీటీడీ సభ్యుడిగా నియమించారని న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొన్నారని, ఎమ్మెల్యే ఉదయభానుపై క్రిమినల్ కేసులు నమోదు కాబడ్డాయని శ్రావణ్ కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో హైకోర్టు కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. అలాగే టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డిలకు వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2023-09-13T15:52:04+05:30 IST