Tangirala Soumya: డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండించిన తంగిరాల సౌమ్య
ABN , First Publish Date - 2023-10-18T15:35:54+05:30 IST
ఎన్టీఆర్ జిల్లా: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై చేసిన అనుచిత, అసత్య వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఖండించారు.
ఎన్టీఆర్ జిల్లా: ఉప ముఖ్యమంత్రి (Deputy CM) నారాయణస్వామి (Narayanaswamy).. టీడీపీ అధినేత (TDP Chief) నారా చంద్రబాబు (Nara Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari)పై చేసిన అనుచిత, అసత్య వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే (Ex MLA) తంగిరాల సౌమ్య (Tangirala Soumya) ఖండించారు. ఈ సందర్భంగా బుధవారం ఎన్టీఆర్ జిల్లా, నందిగామలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నారాయణస్వామి బుద్ధి, జ్ఞానం లేకుండా మతిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీ రామారావు (NTR) ఎప్పుడు చనిపోయారో, చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి వివాహం ఎప్పుడు జరిగిందో తెలియకుండానే నారాయణస్వామి మతిలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తండ్రిని చంపిన వ్యక్తినే భువనేశ్వరి పెళ్లి చేసుకున్నారని నారాయణస్వామి ఎలా మాట్లాడుతారన్నారు. ఎన్టీఆర్ మరణించింది 1996లో అయితే, చంద్రబాబు, భువనేశ్వరి వివాహం 1981లో జరిగిందన్నారు. ఇంత చిన్న విషయం కూడా తెలియకుండానే నారాయణ స్వామి మతిలేకుండా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనేశ్వరిని కలవడానికి వెళ్లేవారిపై ఈ ప్రభుత్వం ఎందుకు అంత కర్కశంగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబుకు మద్ధతుగా భువనేశ్వరి, బ్రహ్మణి చేపట్టిన నిరసన కార్యక్రమాలన్నీ విజయవంతం కావడంతో పాలకుల్లో భయం మొదలైందన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు నారాయణస్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తంగిరల సౌమ్య డిమాండ్ చేశారు.