TDP Leader: శ్రీవాణి ట్రస్టు దోపిడీని ఆపాలి..ప్రతీ పైసాకు లెక్క చెప్పాలి
ABN , First Publish Date - 2023-06-20T13:24:25+05:30 IST
ఏడుకొండల స్వామి వారికి ద్రోహం తలపెట్టిన వారు బతికి బట్ట కట్టలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్నారాయణమూర్తి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... స్వామికి అపచారం జరిగితే ఊరుకోమని...అవసరం అయితే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
విశాఖపట్నం: ఏడుకొండల స్వామి వారికి ద్రోహం తలపెట్టిన వారు బతికి బట్ట కట్టలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనాయణమూర్తి (TDP Leader Bandaru Satyanarayana) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... స్వామికి అపచారం జరిగితే ఊరుకోమని... అవసరం అయితే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2019 లో శ్రీవాణి ట్రస్టు పెట్టారన్నారు. అయితే దీనిని ఒక వ్యాపార సంస్థగా మార్చారని.. నిధులు దారి మళ్లుతున్నాయని ఆరోపించారు. శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) దోపిడీని ఆపాలన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ప్రతిరోజు 10 వేల రూపాయల విలువ గల టికెట్లు అమ్ముతున్నారని కానీ రసీదు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ వివరాలను టీటీడీ వార్షిక బడ్జెట్‌లో పెట్టడం లేదని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటి వరకు ఎన్ని టికెట్లు అమ్మారో.. ఎంత డబ్బులు వచ్చాయో టీటీడీ ట్రస్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీవాణి ట్రస్టు నిధులపై సుబ్బారెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నార.. దోపిడీని ఆపాలని అన్నారు. విరాళాలు సద్వినియోగం చేయాలని... రాజకీయాలు చేయవద్దని హితవుపలికారు. శ్వేత పత్రం విడుదల చేస్తామని అన్నారు కదా... దమ్ముంటే సుబ్బారెడ్డి విడుదల చేయాలని.. ప్రతి పైసాకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. పింక్ డిమాండ్ పోయిందని అన్నారు కదా.. ఏమైందో చెప్పాలన్నారు. విరాళాలు దేవుడు ఖాతాలలోకి వెళ్లకుండా... మీ బొక్కసంలోకి వెల్లుతుందనే అనుమానాలు ఉన్నాయన్నారు. దేవుడు పేరు చెప్పి... స్వామి వారి నిధులు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు దేవుడి మీద, హిందూ మతం మీద నమ్మకం లేదన్నారు. జగన్‌ను ఔరంగజేబు, తుగ్లక్‌తో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. విశాఖ కిడ్నాప్ వ్యవహారంపై సీఎం స్పందించాలని... దీనిపై సీబీఐ విచారణ జరపాలని బండారు సత్నారాయణమూర్తి డిమాండ్ చేశారు.