Election results: మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత?
ABN , First Publish Date - 2023-03-02T11:01:22+05:30 IST
మేఘాలయ శాసన సభ ఎన్నికల ఫలితాలుహంగ్ అసెంబ్లీని సూచిస్తుండటంతో బీజేపీ (BJP)తో జట్టు కడతామనే సంకేతాలను అధికార ఎన్‌పీపీ
న్యూఢిల్లీ : మేఘాలయ శాసన సభ ఎన్నికల ఫలితాలు (Meghalaya Assembly Election Results 2023) హంగ్ అసెంబ్లీని సూచిస్తుండటంతో బీజేపీ (BJP)తో జట్టు కడతామనే సంకేతాలను అధికార ఎన్‌పీపీ (NPP) పంపిస్తోంది. ఎన్‌పీపీ ఎంపీ (రాజ్యసభ) వన్వీరోయ్ ఖర్లుఖి ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, ఇది బీజేపీ, ఎన్‌పీపీ కూటమికి లభించిన ప్రజా తీర్పు అని, మేఘాలయలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే సంకేతాలను పంపించారు.
మేఘాలయ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎన్‌పీపీ, టీఎంసీ (TMC) హోరాహోరీగా పోరాడాయి. కాంగ్రెస్ (Congress) మేఘాలయ శాఖ అధ్యక్షుడు విన్సెంట్ పాలా తాను పోటీ చేస్తున్న సుటంగ సైపుంగ్ స్థానంలో వెనుకంజలో కనిపిస్తున్నారు. ఈ స్థానంలో ఎన్‌పీపీ అభ్యర్థి శాంతా మేరీ షైలా 43 శాతానికిపైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ మేఘాలయ శాఖ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్‌రీ పశ్చిమ షిల్లాంగ్ నియోజకవర్గంలో వెనుకంజలో కనిపిస్తున్నారు. ఇక్కడ యూడీపీ అభ్యర్థి పౌల్ లింగ్డో ఆధిక్యంలో ఉన్నారు.
టిక్రికిలా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అభ్యర్థి ముకుల్ సంగ్మాపై ఎన్‌పీపీ అభ్యర్థి జిమ్మీ సంగ్మా ఆధిక్యంలో ఉన్నారు. టీఎంసీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తుండటంతో ముకుల్ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ చూస్తున్నారు.
ఎన్‌పీపీ నేత రాన్సమ్ సుటుంగ మాట్లాడుతూ, ఫలితాలనుబట్టి చూస్తే తమ పార్టీ పరిస్థితి చాలా బాగుందన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కన్నా ఎక్కువ స్థానాలను తాము దక్కించుకునే అవకాశం ఉందన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
ఇవి కూడా చదవండి :
Meghalaya Poll Results : అందరి చూపు ముకుల్ సంగ్మావైపు!
Meghalaya Results : మేఘాలయలో రసవత్తర పోరు... టీఎంసీ జోరు...