Share News

US: సిక్కు యువకుడిపై జాత్యంహకార దాడి.. మా దేశంలో తలపాగా ధరించమంటూ విరుచుకుపడిన వైనం!

ABN , First Publish Date - 2023-10-18T10:30:48+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా (America) లో భారత్‌కు చెందిన సిక్కు యువకుడిపై జాత్యంహకార దాడి జరిగింది. ఓ శ్వేతజాతీయుడు మా దేశంలో తలపాగా (Turban) ధరించమంటూ యువకుడిపై విరుచుకుపడ్డాడు.

US: సిక్కు యువకుడిపై జాత్యంహకార దాడి.. మా దేశంలో తలపాగా ధరించమంటూ విరుచుకుపడిన వైనం!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America) లో భారత్‌కు చెందిన సిక్కు యువకుడిపై జాత్యంహకార దాడి జరిగింది. ఓ శ్వేతజాతీయుడు మా దేశంలో తలపాగా (Turban) ధరించమంటూ యువకుడిపై విరుచుకుపడ్డాడు. న్యూయార్క్ నగరంలో ఈ జాతి వివక్షతో కూడిన దాడి జరిగింది. మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (MTA) బస్సులో ఒక అమెరికన్ వ్యక్తి 19 ఏళ్ల సిక్కు యువకుడిని పలుమార్లు కొట్టి, అతని తలపాగాను తొలగించేందుకు ప్రయత్నించాడు. ఆదివారం ఉదయం రిచ్‌మండ్ హిల్‌లోని లిబర్టీ అవెన్యూ సమీపంలో 118వ వీధిలో ఒక షటిల్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ (New York City Police Department) తెలిపింది. ఈ సందర్భంగా సిక్కు యువకుడిపై దాడికి పాల్పడిన అనుమానితుడి ఒక చిత్రాన్ని విడుదల చేశారు.

దాడికి పాల్పడిన వ్యక్తి వయసు 25-35 సంవత్సరాలు ఉంటుందని చెప్పిన పోలీసులు.. ముదురు రంగు, స్లిమ్ బిల్డ్, సుమారు 5'9 పొడవు, గోధుమ కళ్ళు, నల్లటి జుట్టుతో ఉంటాడని పేర్కొన్నారు. కాగా, సిక్కు యువకుడిపై జరిగిన ద్వేషపూరిత దాడి (Racially Attack) తో తీవ్రంగా కలత చెందామని యూఎస్‌లోని ఓ సిక్కు సంఘం పేర్కొంది. ప్రస్తుతం బాధితుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడని చెప్పిన సిక్కు కమ్యూనిటీ కార్యకర్త జప్నీత్ సింగ్.. అతని కుటుంబం చాలా భయపడుతోందని తెలిపారు. బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడని, మరికొద్ది రోజులు పని చేయలేడని జప్నీత్ చెప్పారు. ఈ ఘటనపై ఎన్‌వైపీడీ (NYPD) హేట్ క్రైమ్స్ యూనిట్ దర్యాప్తు చేస్తోంది.

NRI: యూఎస్ బిగ్‌టెక్ తొలగింపులలో భారత హెచ్-1బీ వర్కర్లకు తీవ్ర అన్యాయం.. ఎన్నారైల గగ్గొలు


Updated Date - 2023-10-18T10:30:48+05:30 IST