MLA Rapaka : టీడీపీ నుంచి 10 కోట్ల డీల్ వచ్చిందన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాపాక యూటర్న్.. ఇంతకీ ఎవరా 10 మంది ఎమ్మెల్యేలు..!
ABN , First Publish Date - 2023-03-26T18:02:05+05:30 IST
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Quota MLC Elections) ముగిసి రోజులు గడుస్తున్నా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల తూటాలు ఆగట్లేదు...
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Quota MLC Elections) ముగిసి రోజులు గడుస్తున్నా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం మాటల తూటాలు ఆగట్లేదు. నిన్న, మొన్న అంతా క్రాస్ ఓటింగ్ వేశారని వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు (4 YSRCP MLAs) ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sirdhar Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) , ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) లపై అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేయగా.. వాళ్లంతా రియాక్ట్ అవ్వడం, మీడియా ముందుకు తీవ్ర దుమారం రేపే కామెంట్స్ చేయడంతో పెద్ద రచ్చే జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం ఇంకా సద్దుమణుగక ముందే తాజాగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (MLA Rapaka Varaprasad Rao) 10 కోట్ల వ్యవహారం అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెరపైకి వచ్చారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేస్తే తనకు 10 కోట్లు (10 Crores For Vote) ఇస్తానని ఓ ఎమ్మెల్యే తనకు అత్యంత ఆప్తుడైన కేఎస్ఎన్ రాజును సంప్రదించారన్నారు. దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే, ముఖ్య నేతలు మీడియా (Media), సోషల్ మీడియా (Social Media) వేదికగా పెద్ద ఎత్తున సంప్రదించారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు రాపాక ఒక్కసారిగా టోన్ మార్చేశారు. అయితే రాపాక మొదట ఏమన్నారు..? టీడీపీ (Telugudesam) నుంచి రియాక్షన్ వచ్చిన తర్వాత ఆయన ఎలా మాట మార్చారు..? అనే విషయాలు ఇప్పుడీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
మొదట రాపాక ఏమన్నారు..!?
‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం నాకే వచ్చింది. క్రాస్ ఓటింగ్ చేస్తే నాకు టీడీపీ పదికోట్లు ఇస్తామని టీడీపీ ఆఫర్ చేసింది. నా ఓటు (Rapaka Vote) అమ్మితే రూ. 10 కోట్లు వచ్చేది. నాకు డబ్బులు ఎక్కువై నేను వద్దనలేదు. నా ఓటు కోసం నా మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారు. అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు టీడీపీకి ఓటేయమన్నారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్ ఉంటుందని నాకు హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) గారిని నమ్మాను కాబట్టి టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించాను. సిగ్గు, శరం వదిలేస్తే నాకు పదికోట్లు వచ్చి ఉండేవి. ఒక్కసారి పరువు పోతే సమాజంలో ఉండలేం. టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్‌కు ఓకే చెబితే నాకు కూడా 10 కోట్లు వచ్చేవి. ఈ విషయం పార్టీ అధిష్ఠానానికి నేను చెప్పలేదు. ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌కు (MLA Sateesh) , మరో మంత్రికి మాత్రమే ఈ విషయం నేను చెప్పాను. వాళ్లు అధిష్ఠానానికి చెప్పారో లేదో నాకు తెలియదు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు (MLA Manthena Ramaraju) నా దగ్గరికి ఈ 10 కోట్ల రూపాయిల బేరం తెచ్చాడు. అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యేతో నాతో మాట్లాడారో లేదో సీసీ కెమెరాల్లో (CC Camera) చెక్ చేసుకోండి’ అని రాపాక వరప్రసాద్ ఆదివారం నాడు ఉదయం చెప్పారు.
రాపాక ఇప్పుడు ఏమంటున్నారు..!?
అయితే మధ్యాహ్నం అయ్యే సరికి ఒక్కసారిగా రాపాక టోన్ (Rapaka Tone) మారిపోయింది. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పుడు ఓటు వేస్తే నాకు పది కోట్లు వచ్చేవి అన్నాను అంతేకానీ వచ్చిందని నేను ఎక్కడా చెప్పలేదు. ఒక నాయకుడు నుంచి ఆపర్ వచ్చింది అని చెప్పానే తప్ప ఇన్ని కోట్లు అని కాదు. పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. టీడీపీ ఉండి ఎమ్మెల్యే రామరాజు మొదట వైసీపీకి చెందిన నా స్నేహితుడు కేఎస్‌ఎన్ రాజును సంప్రదించారు. వారికి అనుకూలంగా ఓటు వేస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నా స్నేహితుడు నిరాకరించడంతో రామరాజు నేరుగా నాకు ఫోన్ చేశాడు. నేను క్రాస్ ఓటు వేయడానికి నిరాకరించాను. కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవినీతికి ఎలా తల వంచకూడదో చెప్పాను. జగన్ మోహన్ రెడ్డి పైన ఉన్న నమ్మకమే నన్ను ఇతరుల్లా డబ్బుకి ఆశ పడకుండా నిలిచేలా చేసింది. ఎమ్మెల్యేలను కొనకుండానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు పడ్డాయా..?. మెజార్టీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ (Cross Voting) వేశారు. టీడీపీ వాళ్లు ప్రలోభపెట్టకుండా వాళ్లు ఎలా ఓటేస్తారు. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీకి 19 మాత్రమే ఓట్లు ఎలా వచ్చాయి. టీడీపీకి ఓట్లు కొనడం కొత్త కాదు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికింది టీడీపీ కాదా..?. ఓటుకు నోటు కేసులో (Cash For Vote) చంద్రబాబు (Chandrababu) హస్తం ఉందా.. లేదా..?. నేను వైసీపీకి డైరెక్టుగా సపోర్టు చేసి గడప గడపకు తిరుగుతున్నాను. టీడీపీ 10 మంది ఎమ్మెల్యేల కోసం ప్రయత్నిస్తే నలుగురు మాత్రమే వచ్చారు. వీడియోను వైరల్ చేసి ఎవరి మెప్పు పొందాల్సిన అవసరం నాకు లేదు’ అని రాపాక వ్యాఖ్యానించారు.
మొత్తానికి చూస్తే.. రాపాక చేసిన హడావుడి అంతా ఇంతా కాదన్న మాట. మొదట 10 కోట్లు అనడం ఆ తర్వాత 10 కోట్లు దాకా వచ్చేవి అని మాట మార్చేయడం ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా ఇట్టే అనుమానం రావడం సహజమే. ఇందులో నిజానిజాలెంతో రాపాక మిత్రుడు, ఆయన్ను సంప్రదించిన ఎమ్మెల్యేకు అసలేం జరిగిందో తెలియాలి మరి. మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు, ఆధారాలు ఎప్పుడు బయటికి వస్తాయో వేచి చూడాల్సిందే మరి.