AP Assembly : అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసిపోయిన ఆనం.. కోటంరెడ్డి సంగతేంటంటే..!
ABN , First Publish Date - 2023-03-14T19:48:30+05:30 IST
అవును.. మీరు వింటున్నది నిజమే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి గళం వినిపించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Mla Anam Ramanarayana Reddy) టీడీపీలో (Telugudesam) కలిసిపోయారు.
అవును.. మీరు వింటున్నది నిజమే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి గళం వినిపించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Mla Anam Ramanarayana Reddy) టీడీపీలో (Telugudesam) కలిసిపోయారు..! ఇదేంటి ఆయన పసుపు కండువా ఎప్పుడు కప్పుకున్నారని ఆలోచనలో పడ్డారా.. అదేమీ లేదండోయ్ అసలు కథ వేరే ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) మంగళవారం నుంచి మొదలయ్యాయి. సమావేశాలకు ఆనం హాజరయ్యారు. అధికార పార్టీపై ఆయన ధిక్కార స్వరం వినిపించడంతో అటు వైసీపీలో వైపు కూర్చోలేదు. పైగా ప్రత్యేకంగా కూడా కూర్చోవడానికి కూడా ఛాన్స్ ఉందో లేదో అనుకున్నారేమో కానీ.. నేరుగా వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు. అంటే.. టీడీపీ శాసన సభ్యులతో కలిసి కూర్చున్నారన్న మాట. మరి ఈయనతో పాటు వైసీపీపై వ్యతిరేకంగా మాట్లాడిన మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) ఏమయ్యారు..? ఆయన అసెంబ్లీలో ఎక్కడ కూర్చున్నారు..? అసలు కోటంరెడ్డి అసెంబ్లీకి వచ్చారా లేదా..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగింది..?
ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేరిన సందర్భాలు మనం చాలానే చూసుంటాం. కానీ.. ఏపీలో ఎందుకో పూర్తి భిన్నంగా పరిస్థితులున్నాయ్. అధికార పార్టీనే ధిక్కరించి ప్రతిపక్ష పార్టీవైపు ఎమ్మెల్యేలు చూస్తున్నారంటే ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగానే చూస్తుంటాం. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే వెళ్లి టీడీపీ శాసనసభ్యుల్లో కలిసిపోయి ఉండటం మామూలు విషయం కాదు. ఇప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Venkatagiri MLA) కూడా అదే చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష టీడీపీ సభ్యుల వైపు వెళ్లి కూర్చోని వైసీపీ అధిష్టానానికి ఒకింత షాకిచ్చారని చెప్పుకోవచ్చు. ఆయన రెబల్‌గా ఉన్నారు కాబట్టి అటు ప్రతిపక్షం.. ఇటు అధికార పక్షానికి సంబంధం లేకుండా కూర్చుంటారని వైసీపీ సభ్యులు భావించారట. కానీ సడన్‌గా ఆనం టీడీపీ సభ్యుల్లోనే కలిసిపోవడం.. పైగా మొదటివరుసలోనే ఆనం కనిపించడంతో అధికార పార్టీ సభ్యులు ఒకింత కంగుతిన్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో (Socail Media) ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై వైసీపీ-టీడీపీ (YSRCP-TDP) కార్యకర్తలు, వీరాభిమానుల మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. ఆనం వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత ఈయన్ను పక్కనెట్టి వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమల్లి రామ్ కుమార్‌కు (Nedurumalli Ram Kumar) ఇంచార్జ్ బాధ్యతలు కట్టబెట్టింది. అప్పట్నుంచి ఇక అస్సలు ఆయన వైసీపీ చేపట్టే ఏ కార్యక్రమాల్లోనూ అధికారికంగా పాల్గొనట్లేదు. దాదాపు ఆయన వైసీపీకి దూరమైనట్లేనని ఆనం వీరాభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు. కాగా.. తన నియోజకవర్గ సమస్యలు, చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు కావట్లేదని బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఈ పరిస్థితులు వచ్చిన విషయం విధితమే.
కోటంరెడ్డి కథేంటి..!?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన మొబైల్ ట్యాపింగ్ (Phone Tapping) చేశారన్న ఆరోపించి.. అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో పార్టీ నుంచి బయటికొచ్చేశారు. వరుసగా మీడియా మీట్‌లు పెట్టి అధికార పార్టీ తీరును ఎండగట్టారు. దీంతో ఆయనపై ఆగ్రహించిన వైసీపీ అధిష్టానం కోటంరెడ్డి నియోజకవర్గం రూరల్‌ను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి (Adala Prabhakar Reddy) అప్పగించింది. ఇటీవలే ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని (Kotam Reddy Giridhar Reddy) కూడా పార్టీ నుంచి బహిష్కరించింది వైసీపీ (YSR Congress). తన నియెజకవర్గం సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తుతానని ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ పదేపదే చెప్పారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు అయితే ఆయన ఎక్కడా కనిపించలేదు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కోటంరెడ్డి హాజరుకాలేకపోయారట. రేపో, ఎల్లుండి సమావేశాలకు వస్తే ఆయన ఎక్కడ కూర్చుంటారు..? ఏం మాట్లాడతారు..? అనేదానిపై కోటంరెడ్డి అభిమానులు, అనుచరులు, కార్యకర్తల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. కోటంరెడ్డి మాట్లాడితే ఆయనకు ఏ రేంజ్‌లో కౌంటర్లివ్వాలనేదానిపై ఒకరిద్దరు ఎమ్మెల్యేలను అధిష్టానం సిద్ధం చేసిందనే టాక్ నడుస్తోంది. ఆయనొస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో మరి.
మొత్తానికి చూస్తే.. రేపో మాపో ఈ ఇద్దరు ఎమ్మెల్యే అసెంబ్లీ (AP Assembly) వేదికగా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తూ సమస్యలు లేవనెత్తినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఇప్పటి వరకూ ఆనం, కోటంరెడ్డి చేసిన సుదీర్ఘ ప్రసంగాలన్నింటినీ సభ్యులంతా ఎంతో శ్రద్ధగా వినేవారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? దానికి మళ్లీ రెబల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది తెలియాలంటే ఒకట్రెండు రోజులు ఆగాల్సిందే మరి.
*************************
ఇది కూడా చదవండి..
*************************
YSRCP : ఏపీ కేబినెట్ నుంచి ముగ్గురు ఔట్ కానున్నారా.. జగన్ ప్రకటనతో మంత్రుల్లో పెరిగిపోయిన టెన్షన్.. ఇంతకీ వారెవరు..!?
*************************
Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?
******************************