Snake: ఏంటమ్మా.. ఈ పామును ఆస్పత్రికి ఎందుకు తెచ్చావన్న డాక్టర్లు.. 60 ఏళ్ల ఆ బామ్మ చెప్పింది విని..!

ABN , First Publish Date - 2023-06-23T15:13:08+05:30 IST

అన్ని పాములూ విషపూరితం కాదు. అవగాహన లేకపోవడంతో చాలా మంది పాము అనగానే భయంతో ఒణికిపోతుంటారు. మరికొందరు పాములతో చెలగాటం ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు పాము కాటు వేసినా నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన..

Snake: ఏంటమ్మా.. ఈ పామును ఆస్పత్రికి ఎందుకు తెచ్చావన్న డాక్టర్లు.. 60 ఏళ్ల ఆ బామ్మ చెప్పింది విని..!

అన్ని పాములూ విషపూరితం కాదు. అవగాహన లేకపోవడంతో చాలా మంది పాము అనగానే భయంతో ఒణికిపోతుంటారు. మరికొందరు పాములతో చెలగాటం ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు పాము కాటు వేసినా నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వృద్ధురాలికి సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 60 ఏళ్ల వృద్ధురాలు పామును పట్టుకుని ఆస్పత్రికి వెళ్లింది. పామును ఆస్పత్రికి ఎందుకు తెచ్చావమ్మా.. అని వైద్యులు అడిగారు. చివరకు ఆమె చెప్పింది విని అంతా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఒడిశా (Odisha) కేంద్రపరా జిల్లా మహాకలపాడ పరిధి లునిమతియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కల్పనా నాయక్ అనే 60 ఏళ్ల వృద్ధురాలు (old woman) స్థానికంగా నివాసం ఉంటోంది. బుధవారం ఆమె ఇంట్లో పడుకుని ఉండగా ప్రమాదకర పిల్ల రస్సెల్స్ పాము (russell snake bite) కాటు వేసింది. గమనించిన వృద్ధురాలు ఏమాత్రం భయపడకుండా పామును పట్టుకుని ఓ పెట్టెలో బంధించింది. గురువారం ఉదయం మహాకలపాడ పీహెచ్‌సీ కేంద్రానికి తీసుకెళ్లింది. వైద్యులు ఆమె తీసుకొచ్చిన పామును చూసి ‘‘పామును ఆస్పత్రికి ఎందుకు తెచ్చావమ్మా’’.. అని ప్రశ్నించారు. వృద్ధురాలు జరిగిన విషయం చెప్పడంతో షాక్ అయిన వైద్యులు (Doctors) వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కేంద్రపరాలోని జిల్లా ఆసత్రికి తరలించారు.

Viral Video: ఇంత చిన్న వయసులోనే ఎన్ని కష్టాలొచ్చాయి బిడ్డా..? నెటిజన్లను కట్టిపడేస్తున్న వీడియో ఇది..!

ఆమె పామును జిల్లా ఆస్పత్రికి కూడా తన వెంట తీసుకెళ్లింది. మహిళ పరిస్థితిని తెలుసుకున్న వైద్యులు ఆమెకు వెంటనే చికిత్స చేశారు. సకాలంలో చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం వృద్ధురాలు కోలుకుంటోందని చెప్పారు. అనంతరం పామును అడవిలో వదిలేశారు. దీనిపై ఒడిశా స్నేక్ హెల్ప్‌లైన్ జనరల్ సెక్రటరీ సువేందు మల్లిక్ మాట్లాడుతూ పిల్ల రస్సెల్స్ వైపర్ పాముల్లోనూ మనుషులను చంపే విషం ఉంటుందన్నారు. పామును ఆస్పత్రికి తీసుకెళ్లి.. మహిళ సరైన పని చేసిందన్నారు. సరైన చికిత్స అందించేందుకు దోహదపడిందని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: 22 సెకన్ల నిడివి ఉన్న స్కూటీ వీడియో.. చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. అందరి నోటా ఒకే ఒక్క ప్రశ్న..!

Updated Date - 2023-06-23T15:21:43+05:30 IST