World Cup ఫీవర్ ప్రారంభం.. టోర్నీకి ముందే కలుసుకున్న భారత్, పాకిస్థాన్ కెప్టెన్లు

ABN , First Publish Date - 2023-10-04T15:47:26+05:30 IST

క్రికెట్ పండుగ వన్డే ప్రపంచకప్‌నకు సమయం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని వరల్డ్ కప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు ఇక తెరపడనుంది. మరికొన్ని గంటల్లోనే ప్రపంచకప్ మహాసంగ్రామం ప్రారంభంకానుంది.

World Cup ఫీవర్ ప్రారంభం.. టోర్నీకి ముందే కలుసుకున్న భారత్, పాకిస్థాన్ కెప్టెన్లు

క్రికెట్ పండుగ వన్డే ప్రపంచకప్‌నకు సమయం ఆసన్నమైంది. ఎప్పుడెప్పుడా అని వరల్డ్ కప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు ఇక తెరపడనుంది. మరికొన్ని గంటల్లోనే ప్రపంచకప్ మహాసంగ్రామం ప్రారంభంకానుంది. గత ప్రపంచకప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లే ఈ సారి తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ ప్రారంభ మ్యాచ్‌తో ప్రపంచకప్ పండుగకు తెరవలేనుంది. 45 రోజులపాటు క్రికెట్ ప్రేమికులను ప్రపంచకప్ అలరించనుంది. ప్రతిరోజూ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులను ఆనందంలో మంచెత్తనుంది. అయితే ప్రపంచకప్ ప్రారంభానికి ఒక రోజు అహ్మదాబాద్‌లో 10 జట్ల కెప్టెన్లు కలుసుకున్నారు. కెప్టెన్స్ డే కార్యక్రమంలో అన్ని జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సైతం కలుసుకున్నారు. ఒకరినొకరు కలుసుకుని అప్యాయంగా పలకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్లందరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అలాగే ప్రపంచకప్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు అహ్మదాబాద్ చేరుకున్న అన్ని జట్ల కెప్టెన్లకు ఘనస్వాగతం లభించింది. ఇక టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.


టీమిండియా ప్రపంచకప్ జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

Updated Date - 2023-10-04T15:51:23+05:30 IST