Share News

World Cup: అతి ఆత్మవిశ్వాసంతో ఆడితే ఇలానే ఉంటుంది.. టీమిండియాపై పాక్ లెజెండ్ విమర్శలు

ABN , First Publish Date - 2023-11-20T14:20:52+05:30 IST

Shahid Afridi: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన బాధలో ఉన్న టీమిండియాపై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిదీ విమర్శలు చేశాడు. అతి ఆత్మవిశ్వాసం ఖరీదైనదని నిరూపించబడిందని అన్నాడు. అతి ఆత్మవిశ్వాసమే వరల్డ్‌ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణమని ఓ పాకిస్థాన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్రిదీ వ్యాఖ్యానించాడు.

World Cup: అతి ఆత్మవిశ్వాసంతో ఆడితే ఇలానే ఉంటుంది.. టీమిండియాపై పాక్ లెజెండ్ విమర్శలు

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన బాధలో ఉన్న టీమిండియాపై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిదీ విమర్శలు చేశాడు. అతి ఆత్మవిశ్వాసం ఖరీదైనదని నిరూపించబడిందని అన్నాడు. అతి ఆత్మవిశ్వాసమే వరల్డ్‌ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణమని ఓ పాకిస్థాన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్రిదీ వ్యాఖ్యానించాడు. ఆఫ్రిదీ చేసిన ఈ వాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో ఆఫ్రిదీ మాట్లాడుతూ "జబ్ ఆప్ కంటిన్యూలీ జీతే జాతే హో, తో ఆప్ ఓవర్ కాన్ఫిడెంట్ భీ హో జాతే హై, వో ఆప్కో మార్వా దేతీ హై" అని అన్నాడు. ‘‘మీరు నిలకడగా గెలిచినప్పుడు అతి విశ్వాసంతో ఉంటారు. అది మీ పతనానికి దారి తీస్తుంది.’’ అని ఆఫ్రిదీ వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా మూడో వికెట్ కోల్పోయాక విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆఫ్రిదీ ఈ వ్యాఖ్యలు చేశాడు.


కాగా పదికి పది విజయాలతో దూసుకెళ్లిన టీమిండియాను ఆదివారం జరిగిన వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా అడ్డుకుంది. పక్కా ప్రణాళికతో, ప్రశాంత చిత్తంతో బరిలోకి దిగిన ఈ జట్టు అన్ని విభాగాల్లోనూ చెలరేగింది. తద్వారా 6 వికెట్లతో నెగ్గి వన్డే వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆసీస్‌ కెరీర్‌లో ఇది ఆరో టైటిల్‌ కావడం విశేషం. గాయంతో తొలి ఐదు మ్యాచ్‌లకు దూరమైన ట్రావిస్‌ హెడ్‌ (120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137) ఈ విజయానికి కారణమయ్యాడు. అతడికి లబుషేన్‌ (110 బంతుల్లో 4 ఫోర్లతో 58 నాటౌట్‌) సహకరించడంతో మూడో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ (66), విరాట్‌ (54), రోహిత్‌ (47) మాత్రమే రాణించారు. స్టార్క్‌కు మూడు.. కమిన్స్‌, హాజెల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసి గెలిచింది. బుమ్రాకు 2 వికెట్లు లభించాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హెడ్‌ నిలిచాడు.

Updated Date - 2023-11-20T14:20:54+05:30 IST