Ravi Teja: ఆశలు రేపుతున్న జూనియర్ పాండ్యా.. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చేస్తాడా?
ABN , First Publish Date - 2023-11-10T21:05:38+05:30 IST
Hardik Pandya: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దీంతో మెగా టోర్నీలో నాకౌట్ మ్యాచ్‌లలో టీమిండియా విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని మాజీ క్రికెట్లు అభిప్రాయపడుతున్నారు. పాండ్యాకు ప్రత్యామ్నాయంగా భారత్‌కు మరో నిఖార్సైన ఆల్‌రౌండర్ లేకపోవడం మైనస్ అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మరో పాండ్య లాంటి ఆటగాడు తయారవుతున్నాడు. అతడు ఎవరో కాదు తెలుగు క్రికెటర్ రవితేజ.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. మిడిలార్డర్‌లో కీలక సమయాల్లో బ్యాటింగ్‌లో ఆదుకునే అతడు బౌలింగ్‌లో కూడా రాణించగలడు. దీంతో మెగా టోర్నీలో నాకౌట్ మ్యాచ్‌లలో టీమిండియా విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని మాజీ క్రికెట్లు అభిప్రాయపడుతున్నారు. పాండ్యాకు ప్రత్యామ్నాయంగా భారత్‌కు మరో నిఖార్సైన ఆల్‌రౌండర్ లేకపోవడం మైనస్ అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మరో పాండ్య లాంటి ఆటగాడు తయారవుతున్నాడు. అతడు ఎవరో కాదు తెలుగు క్రికెటర్ రవితేజ. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భవిష్యత్ హార్దిక్ పాండ్యాగా 29 ఏళ్ల రవితేజ కనిపించాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ తరఫున ఆడిన రవితేజ ఏడు మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాటింగ్‌లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ బ్యాటింగ్‌లో కూడా రాణించగల సామర్థ్యం రవితేజకు ఉంది. ఎందుకంటే లిస్ట్-ఎ క్రికెట్‌లో అతడి యావరేజ్ చెప్పుకోదగ్గ రీతిలోనే ఉంది.
లిస్ట్-ఎలో 35 మ్యాచ్‌లు ఆడిన రవితేజ 950 పరుగులు చేసి 27 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక స్కోరు 103గా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 25 మ్యాచ్‌లు ఆడి 1197 పరుగులు చేయడంతో పాటు 63 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుకున్నాడు. అత్యధిక స్కోరు 115 నాటౌట్‌గా ఉంది. మరోవైపు 35 టీ20 మ్యాచ్‌లలో 235 పరుగులు చేసి 51 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా కాలిమడమ గాయంతో వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్య సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. దీంతో టీ20లలో రెగ్యులర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్య స్థానంలో సూర్యకుమార్ యాదవ్ సారథిగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సూర్యకుమార్‌ను కాదనుకుంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇటీవల ఆసియా క్రీడలలో భారత్‌కు అతడి సారథ్యంలోనే స్వర్ణ పతకం వచ్చింది. దీంతో రుతురాజ్‌ను బీసీసీఐ పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.