Lakshman: ఆనాడు తెలంగాణ ఉద్యమం బంద్ చేస్తానని కేసీఆర్ చెప్పలేదా..?

ABN , First Publish Date - 2023-10-05T19:26:11+05:30 IST

కేసీఆర్(KCR) స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది నిజం కాదా? అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(Lakshman) తీవ్ర ఆరోపణలు చేశారు.

Lakshman: ఆనాడు తెలంగాణ ఉద్యమం బంద్ చేస్తానని కేసీఆర్ చెప్పలేదా..?

హైదరాబాద్: కేసీఆర్(KCR) స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమైంది నిజం కాదా? అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(Lakshman) తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆ పదవి నుంచి వైఎస్‌ను తొలగించి.. తనను సీఎం చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని బంద్ చేస్తానని కేసీఆర్ చెప్పలేదా ఇది నిజం కాదా..? తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయంలో కుటుంబంతో కలిసి సోనియాగాంధీకి దాసోహమై టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్నది వాస్తవం కాదా? బావ బామ్మర్థుల తీరును సభ్యసమాజం అసహ్యించుకుంటోంది. వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ప్రధాని వస్తే మంత్రి హరీష్‌రావు వ్యవహరించిన తీరు హేయనీయం. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో మహాకూటమితో, మొన్నటి ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న మీరా బీజేపీపై విమర్శలు చేసేది? బాప్ ఏక్ నెంబర్ ... కొడుకు దస్ నెంబర్ చోర్..? బీఆర్ఎస్ పార్టీ.. అతి పెద్ద చీటర్స్ పార్టీ. బీఆర్ఎస్ పతనం ఖాయమని తేలిపోయింది.... మోదీ సభకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలే నిదర్శనం. మోదీ రెండు సభలు ట్రెయిలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. కరీంనగర్ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినట్లుగానే తెలంగాణ ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతారు’’ అని ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా హెచ్చరించారు.

Updated Date - 2023-10-05T19:28:33+05:30 IST