Share News

Minister Uttam: గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖను నిర్వీర్యం చేసింది

ABN , Publish Date - Dec 25 , 2023 | 04:19 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS Govt ) సివిల్ సప్లై శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు హుజూర్ నగర్‌లోని చౌకధరల దుకాణాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ...‘‘మిల్లర్ల దగ్గర ఉన్న లెవీ ధాన్యం స్వాధీనం చేసుకుంటాం. ప్రతి ఏటా సివిల్ సప్లై శాఖ 3 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

 Minister Uttam: గత ప్రభుత్వం సివిల్ సప్లై శాఖను నిర్వీర్యం చేసింది

సూర్యాపేట: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS Govt ) సివిల్ సప్లై శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (
Minister Uttam Kumar Reddy ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు హుజూర్ నగర్‌లోని చౌకధరల దుకాణాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ...‘‘మిల్లర్ల దగ్గర ఉన్న లెవీ ధాన్యం స్వాధీనం చేసుకుంటాం. ప్రతి ఏటా సివిల్ సప్లై శాఖ 3 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బియ్యాన్ని తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సిస్టం ద్వారా అమ్ముతాం. అవసరమైతే ఓపెన్ మార్కెట్‌లో బహిరంగ వేలం వేస్తాం. మిల్లర్ల వద్ద ఎలాంటి గ్యారెంటీ లేకుండా 22 వేల కోట్ల ధాన్యం గత ప్రభుత్వం పెట్టింది’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Dec 25 , 2023 | 04:19 PM