Anitha: డీఎస్పీల శిక్షణలో మహిళల ప్రతిభ ఎంతో గర్వకారణం
ABN , Publish Date - Nov 05 , 2024 | 12:56 PM
Andhrapradesh: అనంతపురం పీటీసీలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎస్పీల ట్రైనింగ్‌లో మహిళలు ప్రతిభ కనబరచడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘‘మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాల విషయంలో మనం కార్నర్ అవుతున్నాము’’..
అనంతపురం, నవంబర్ 5: నకల్సిజం, ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించిన వారు ఏపీ పోలీసులు అని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) అన్నారు. మంగళవారం అనంతపురం పీటీసీలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. డీఎస్పీల ట్రైనింగ్‌లో మహిళలు ప్రతిభ కనబరచడం చాలా గర్వంగా ఉందన్నారు.
AP HighCourt: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు.. హైకోర్టులో వైసీపీ నేతకు షాక్
‘‘మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాల విషయంలో మనం కార్నర్ అవుతున్నాము.. అనేక నేరాలు చేసే వారు మనకు సవాళ్లు విసురుతున్నారు. దీనిపై ఎవరు భయపడినా.. పోలీసు వ్యవస్థ మాత్రం భయపడకూడదు’’ అని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. పోలీసు శాఖకు ఇచ్చిన నిధులు కూడా ఖర్చు చేయలేకపోయారన్నారు. లా అండర్ ఆర్డర్‌తో పాటు పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. రాజకీయ ముసుగులో ఉన్మాదులు తప్పించుకుంటున్నారని.. వారి కంట్రోల్ చేయాలన్నారు. సోషియల్ మీడియాలో జరుగుతున్న దాడులు కూడా కంట్రోల్ చేయాలని హోంమంత్రి అనిత వెల్లడించారు.
డీజీపీ కీలక సూచనలు
కాగా.. అనంతపురం పీటీసీలో 2023 బ్యాచ్ కు చెందిన 12మంది డీఎస్పీలతో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 7మంది మహిళా డీఎస్పీలు ఉన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. గతానికి ఇప్పటికీ నేరాల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. వాటికి అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీలకు డీజీపీ కీలక సూచనలు చేశారు. ‘‘మీరు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి.. బాధ్యతగా ఉండాలి. చివరి వరకు నిజాయతీగా, పారదర్శకతతో పని చేయాలి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో.. చివరి వరుకు అలాగే ఉండాలి. మీరు ఇప్పుడు ఎంత ఫిట్ నెస్, జోష్‌తో ఉన్నారో లాస్ట్ డే వరకు సర్వీస్‌లో ఉండాలి’’ అంటూ డీజీపీ తెలిపారు.
Rs 2000 Notes: ఇప్పటికీ ప్రజల దగ్గరే రూ.6970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన..
డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్‌పై డీజీపీ
అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన డీజీపీ ద్వారక తిరుమలరావు స్పందించారు. ‘‘దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ ఇదే మా విధానం. మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం. రాజకీయ ఒత్తిళ్లతో మేం పని చేయం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సెపరేట్‌గా కామెంట్ చేయను. ఐజీ సంజయ్‌పై విచారణ జరుగుతోంది... దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడతాం. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తాం. ఎవరికి ఎంత ప్రొటోకాల్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. టీడీపీ పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగితే భావ ప్రకటన స్వేచ్ఛా అంటూ నీరుగర్చారు. డీజీపీ ఆఫీస్‌లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చాం. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం’’ అని డీజీపీ ద్వారక తిరుమలరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష
AP HighCourt: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు.. హైకోర్టులో వైసీపీ నేతకు షాక్
Read Latest AP News And Telugu News