Share News

AP Politics: అనపర్తి సీటు ఎవరికి? చంద్రబాబు వ్యాఖ్యల్లో అర్థమదేనా?

ABN , Publish Date - Apr 04 , 2024 | 08:51 PM

Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మొత్తం చుట్టేస్తున్నారు. ప్రజాగళం(Prajagalam) పేరుతో కీలక నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రోడ్‌షోలు, బహిరంగ సభలతో ఎన్నికలను హోరెత్తిస్తున్నారు.

AP Politics: అనపర్తి సీటు ఎవరికి? చంద్రబాబు వ్యాఖ్యల్లో అర్థమదేనా?
Anaparthy

Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మొత్తం చుట్టేస్తున్నారు. ప్రజాగళం(Prajagalam) పేరుతో కీలక నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రోడ్‌షోలు, బహిరంగ సభలతో ఎన్నికలను హోరెత్తిస్తున్నారు. గురువారం నాడు చంద్రబాబు కొవ్వూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే మరో కీలక కామెంట్ కూడా చేశారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించినా.. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు చంద్రబాబు. వాస్తవానికి ఈ సీటుకు టీడీపీ తరఫున నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని ప్రకటించారు చంద్రబాబు. కానీ, పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేరు. అయితే, ఈ నిర్ణయం ఇంకా కన్ఫామ్ కాలేదట. తాజా సభలో చంద్రబాబే ఈ విషయాన్ని ప్రకటించారు.


అనపర్తి బీజేపీ అభ్యర్థిగా..

బీజేపీతో పొత్తు కుదరక ముందు టీడీపీ తొలి 90 మందికి పైగా అభ్యర్థులతో లిస్ట్ ప్రకటించింది. ఈ జాబితాలో అనపర్తి నియోజకవర్గ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పేరును ఖరారు చేశారు. అయితే, ఆ తరువాత బీజేపీ కూడా టీడీపీ-జనసేనతో జట్టు కట్టడంతో సమీకరణలు మారాయి. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ తన అభ్యర్థిగా శివకృష్ణం రాజు పేరును ప్రకటించింది. కానీ, ఇక్కడే చిన్న కారణంతో బీజేపీ, టీడీపీలు తమ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.


సీటు మారుతుందా? కారణమిదేనా?

టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తరువాత అనపర్తిలో తన అభ్యర్థిగా శివకృష్ణంరాజును నిలబెట్టింది బీజేపీ. అయితే, బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయడం కంటే.. రాజమహేంద్రవరం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందనే టాక్ బాగా నడిచింది. దీంతో ఇరు పార్టీలు మనసు మార్చుకున్నాయట. ఎందుకంటే.. అనపర్తి నుంచి టీడీపీ పోటీ చేస్తే.. రాజమహేంద్రవరం ఎంపీ స్థానంలో బీజేపీకి విజయం సునాయాసంగా మారుతుందని అంచనా. ఈ విషయంలోనే అటు టీడీపీ, ఇటు బీజేపీ ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొవ్వూరు ప్రజాగళం సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారాయి.


ఇవికూడా చదవండి:

స్కిల్ కేసులో ఛార్జీ షీట్ దాఖలు చేసిన ఏసీబీ

ఒక్క ఛాన్స్ అన్న వైసీపీకి ఇంకా నో ఛాన్స్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2024 | 08:51 PM