CM Chandrababu: ‘నాకు మరో జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా’
ABN , Publish Date - Jun 25 , 2024 | 04:48 PM
‘నాకు మళ్లీ జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో చంద్రబాబు ఉండనున్నారు.
చిత్తూరు: ‘నాకు మళ్లీ జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్నారు.
సీఎంను చూడటానికి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. హంద్రీ-నీవా, కుప్పం బ్రాంచ్ కాలువలను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంలో కుప్పంపై కక్షసాధించారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై మాజీ సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. చివరి దశకు చేరిన ప్రాజెక్టులను బీళ్లుగా మార్చారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
వైసీపీ పాలన పీడ కల..
ఇప్పటివరకు ఎనిమిదిసార్లు కుప్పం నుంచి గెలిచా.
నేను ఇక్కడకు వచ్చినా, రాకున్నా ఆదరించారు
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారు
అహంకారంతో విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
సీఎం అయిన వెంటనే పోలవరం, అమరావతి వెళ్లా
ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు మీ ఆశీస్సుల కోసమే కుప్పం వచ్చా
వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా
కుప్పం అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నా
కుప్పం అన్నింట్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తా
వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పం ఎంచుకున్నా
వైసీపీ పాలన పీడ కల.. అలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు
వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారు
రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తిరగరాయబోతున్నాం
కుప్పం నియోజకవర్గం.. నా రాజకీయాలకు ప్రయోగశాల
యువత, మహిళలు, బలహీనవర్గాలకు అవకాశం ఇచ్చాం
ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం
ఏ తప్పూ చేయకున్నా 30 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారు
కుప్పం ప్రశాంతమైన చోటు.. ఇక్కడ హింసకు చోటులేదు
కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే కడపటి రోజు.. జాగ్రత్త..
కుప్పంను మోడల్ మున్సిపాలిటీగా తయారుచేస్తాం
కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు సిమెంట్ రోడ్లు వేస్తాం
కుప్పంలోని 4 మండల కేంద్రాలను..
ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తాం
కుప్పం అభివృద్ధి పనులు ఈరోజు నుంచే ప్రారంభం
కుప్పంలో ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజీలు, వీధిదీపాలు ఏర్పాటు
కుప్పం పరిధిలో గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు
ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మినరల్ వాటర్ ఇస్తాం
అన్ని గ్రామాలు, పంట పొలాల దగ్గరకు రోడ్లు వేస్తాం