Share News

Ayyannapatrudu: నా రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను చూడలేదు.. షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 22 , 2024 | 03:40 PM

మాజీ సీఎం జగన్‌కు కనీసం సభ మర్యాద కూడా లేదని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను ఎప్పుడు చూడలేదని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు (Chintakayala Ayyannapatrudu) అన్నారు.స్పీకర్ ఎన్నిక సమయంలో విపక్షం ఉండటం అనేది సభా సాంప్రదాయమని తెలిపారు.

Ayyannapatrudu: నా రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను చూడలేదు.. షాకింగ్ కామెంట్స్
Chintakayala Ayyannapatrudu

అమరావతి: మాజీ సీఎం జగన్‌కు కనీసం సభ మర్యాద కూడా లేదని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను ఎప్పుడు చూడలేదని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు (Chintakayala Ayyannapatrudu) అన్నారు.స్పీకర్ ఎన్నిక సమయంలో విపక్షం ఉండటం అనేది సభా సాంప్రదాయమని తెలిపారు. నిన్న వారి పార్టీ నేతలకు కూడా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కేశవ్ కూడా చెప్పారని గుర్తుచేశారు. అయినా ఈ రోజు జగన్, వారి ఎమ్మెల్యేలు రాకపోవడం అతనికి సభ పట్ల ఏం మర్యాద ఉందనేది తెలుస్తుందని అన్నారు. అందుకనే ప్రజలు అతని స్థానం ఏమిటో చూపించారన్నారు. సభకు వచ్చి సంప్రదాయాలను గౌరవించి, ప్రజా సమస్యలను లేవనెత్తి మాట్లాడితే అతనికే మంచిదన్నారు. తాము మాత్రం సభా గౌరవాన్ని పెంచి చూపుతామని పునరుద్ఘాటించారు. ఇది కౌరవ సభ కాదు... సభకు హుందాతనం ఉందని తెలిపారు. కానీ గత సభలో వాళ్లు కౌరవుల్లా వ్యవహరించారని మండిపడ్డారు.


ALSO Read: Nara Lokesh: ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు

అందరి సహకారంతో సభను సజావుగా నడిపి హుందాతనాన్ని, సభా గౌరవాన్ని పెంచుతామని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సంతకం అసెంబ్లీ‌లో ఏబీఎన్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించడాన్ని సంతోషంగా ఉందని తెలిపారు. తొలగించడం సంతోషంగా ఉందని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. పత్రికా స్వేచ్ఛను కూడా హరించే విధంగా గత పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. అందుకనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ఆ నిషేధాన్ని తొలగించామని స్పష్టం చేశారు.


ALSO Read: Pawan Kalyan: పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

స్పీకర్ పదవి బాధ్యతతో కూడుకున్నదని తెలిపారు. దీనిని సమర్ధవంతంగా నిర్వహించి సభా గౌరవాన్ని పెంచుతామని ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ సభలో కన్నీళ్లు పెట్టిన రోజే వైసీపీ పతనం ప్రారంభం అయిందని చెప్పామని అన్నారు. అందుకనే వై నాట్ 175 అంటే దేవుడు, ప్రజలు కలిసి 11 స్థానాలు ఇచ్చి పక్కన పెట్టేశారని చెప్పుకొచ్చారు. చివరకు ప్రేతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టేశారన్నారు. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా వైసీపీ నేతలు అడిగారని చంద్రబాబు నాయుడు ఔదర్యంగా వ్యవహరించారని చెప్పారు. ఆయన వాహనాన్ని ప్రధాన ద్వారం వద్దకు తీసుకున్నారన్నారు. మంత్రులు తర్వాత ఆయనతో ప్రమాణం చేయించారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Cabinet: ఈ నెల 24న ఏపీ కేబినెట్ సమావేశం

AP Assembly Speaker: స్పీకర్ ఎన్నికకు వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు..

Buddha Venkanna: కొడాలి నాని ఊరు వదిలి పో.. లేదంటే..!!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 22 , 2024 | 04:13 PM