Share News

YSRCP: వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్

ABN , Publish Date - Dec 30 , 2024 | 09:12 PM

YSRCP Leaders: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత మరుసటి రోజు నుంచే వైసీపీకి షాక్‌లు మొదలయ్యాయి. నాడు మొదలైన బిగ్ షాక్‌లు నేటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రోజుకో నేత.. రెండ్రోజులకో ఇద్దరు ఎంపీలు రాజీనామాతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

YSRCP: వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్
YSRCP LEADERS

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(AP Elections) ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ(YSR Congress) నేతల్లో అంతర్మథనం మొదలైనట్లుంది. గత ఐదేళ్ల జగన్ పాలన దృష్ట్యా ఏపీలో పార్టీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. అందుకే.. పక్క చూపులు చూస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ముఖ్యనేతలు వైసీపీని వీడగా.. మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు. ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో, లేదో కూడా తెలియడం లేదు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలు వైసీపీకి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామాల బాట పట్టనున్నట్లు సమాచారం.

JANASENA--2.jpg

ఈ క్రమంలోనే తాజాగా గంజి చిరంజీవి, జయమంగళ వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇటీవల వైసీపీని ఇరువురు నేతలు వీడారు. డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సమక్షంలో ఇరువురు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి పవన్ కల్యాణ్ ఇరువురు నేతకు ఆహ్వానం పలికారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా జయమంగళ వెంకటరమణ పని చేశారు. ఆయన కైకలూరుకు చెందిన నేత. వెంకటరమణ వైసీపీని వీడటంతో కైకలూరులో ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మరో నేత గంజి చిరంజీవి ఆప్కో చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికి జయ మంగళ వెంకటరమణ రాజీనామా చేసి మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ పంపించారు.

JANASENA----5.jpg


వైసీపీకి షాక్‌ల మీదు షాక్‌లు..

కాగా.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత మరుసటి రోజు నుంచే వైసీపీకి షాక్‌లు మొదలయ్యాయి. నాడు మొదలైన బిగ్ షాక్‌లు నేటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రోజుకో నేత.. రెండ్రోజులకో ఇద్దరు ఎంపీలు రాజీనామాతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.

JANASENA---4.jpg

వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ అయింది. తాజాగా, ఆ పార్టీ అధినేత జగన్‌కు మరో బిగ్ షాక్ తగలడంతో కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు. గత కొంత కాలంగా వైసీపీపై, పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి వైఖరీని బాహాటంగానే నేతలు విమర్శిస్తున్నారు.ఇలా ఎందరో నేతలు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి బట్టి చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవడం ఖాయం అని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది.

JANASENA.jpg


ఇప్పట్లో ఆగవేమో..!

ఇదిలా ఉంటే త్వరలోనే మరికొందరు నేతలు కూడా రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రాజీనామాలు ఉంటాయని సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని వైసీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని తెలియవచ్చింది. దీన్ని బట్టి చూస్తే రాజీనామాలు ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు.

JANASENA-1.jpg


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Perni Nani: పేర్ని నాని ఫ్యామిలీకి మళ్లీ నోటీసులు

CP Rajasekhar: వార్షిక నేర సమీక్షను విడుదల చేసిన విజయవాడ సీపీ.. ఏం చెప్పారంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 30 , 2024 | 10:15 PM