Narsinga Rao: తక్షణమే ప్రభుత్వo విడుదల చేసిన జీవోను రద్దు చేయాలి
ABN , Publish Date - Jan 06 , 2024 | 04:40 PM
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. హెచ్ నర్సింగరావు ( Narsinga Rao ) డిమాండ్ చేశారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీలపైన ఎస్మాను ప్రయోగించడం అంటే యావత్ కార్మికులు, ప్రజల ప్రజాతంత్ర హక్కులపై దాడి చేయడమేనని నర్సింగరావు చెప్పారు.
విజయవాడ: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. హెచ్ నర్సింగరావు ( Narsinga Rao ) డిమాండ్ చేశారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీలపైన ఎస్మాను ప్రయోగించడం అంటే యావత్ కార్మికులు, ప్రజల ప్రజాతంత్ర హక్కులపై దాడి చేయడమేనని చెప్పారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 7వ తేదీన ఉదయం అన్ని జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కేంద్రాలు, ఆఫీసుల వద్ద పరిశ్రమల వద్ద ఎస్మా జీవో కాపీలను దగ్ధం చేస్తామని పిలుపునిచ్చారు. 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాలు జైల్ భరో నిర్వహిస్తామన్నారు.ప్రభుత్వo మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర బంద్ కూడా చేపడతామని హెచ్చరించారు.
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది
అంగన్వాడీల 25 రోజులుగా సమ్మె చేస్తున్నారని... అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సమ్మెను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. అంగన్వాడీలు అత్యవసర సర్వీసు అని భావించినప్పుడు 25 రోజుల నుంచి సమ్మెను పరిష్కరించకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతనని చెప్పారు. కార్మికులపై ఈరోజు ఎస్మా ప్రయోగించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని 1,04,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఒంటరి మహిళలపై ఇలాంటి కక్షపూరితమైన నిర్ణయం చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఇది నిదర్శనమన్నారు. అంగన్వాడీలు లబ్ధిదారులకు పంచే పోషక పదార్థాలను అత్యవసర సర్వీసులో చేర్చడం చట్ట వ్యతిరేకమని నర్సింగరావు పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...