Share News

AP Politics: వెలుగులోకి పిన్నెల్లి అనుచరుల అరాచకాలు.. ఎన్నికల వేళ ఈవీఎంలను ఎలా ధ్వంసం చేశారో చూడండి..

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:18 AM

అధికారం పోవడంతో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎన్నికల రోజు (మే13) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

AP Politics: వెలుగులోకి పిన్నెల్లి అనుచరుల అరాచకాలు.. ఎన్నికల వేళ ఈవీఎంలను ఎలా ధ్వంసం చేశారో చూడండి..
Destruction EVM

అధికారం పోవడంతో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎన్నికల రోజు (మే13) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఓడిపోతున్నామనే ఆగ్రహంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ ఘటనలో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినా.. ఆయన హైకోర్టును ఆశ్రయించి జూన6 వరకు అరెస్ట్ చేయవద్దని ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత పిన్నెల్లి అనుచరుల అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పోలింగ్ రోజు కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే ఈవీఎంలను ధ్వంసం చేయలేదని.. పిన్నెల్లి అనుచరులు చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇదే విధంగా చేశారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని నిజం చేసేలా ప్రస్తుతం ఒక వీడియో బయటకు వచ్చింది. కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలోని 251వ నెంబర్ పోలింగ్‌బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు పాలకిర్తి శ్రీనివాసరావు ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌ను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే పిన్నెల్లి తన అనుచరులతో వీలైనన్ని ఎక్కువ కేంద్రాల్లో ఈవీఎంలు ధ్వంసం చేయించాలని ముందే ప్రణాళిక వేసుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. పోలింగ్ సరళిని చూసి తాను ఓడిపోతానని భావించి రీపోలింగ్ కోసం పిన్నెల్లి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసి ఉండవచ్చనే చర్చ నడుస్తోంది.

అత్యధిక మెజార్టీతో చరిత్ర సృష్టించాం


పోలీసులు ఉండగానే..

మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలోని 251వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలో ఉన్నారు. ఉదయం 11.21 గంటలకు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన పాలకిర్తి శ్రీనివాసరావు నేరుగా ఈవీఎం వద్దకు వెళ్లి పక్కనే ఉన్న కంట్రోల్ యూనిట్‌ను నేలకేసి కొట్టారు. దీంతో ఈవీఎం కంట్రోల్ యూనిట్ బద్ధలైంది. అదేరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైతం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో జరిగినా.. బయటకు రాకుండా వైసీపీ పెద్దలు మేనేజ్ చేశారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూడటంతో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.


Janasena : ప్రతి ఓటూ బాధ్యత గుర్తుచేసేదే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 06 , 2024 | 12:27 PM