Share News

Kodali Nani: పవన్‌పై ప్రేమ కురిపిస్తూ.. జనసైనికులకు జాగ్రత్తలు చెప్పిన కొడాలి నాని

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:20 PM

మాజీ మంత్రి కొడాలి నానికి సడెన్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రేమ పుట్టుకొచ్చింది. నిజానికి అది ప్రేమ కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా జనసైనికులను రెచ్చగొట్టే కార్యక్రమం. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కొడాలి నాని ఇవాళ ఒక విజ్ఞప్తి చేశారు. అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకుంటారని.. ఆయనను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నట్టుగా తెలిపారు.

Kodali Nani: పవన్‌పై ప్రేమ కురిపిస్తూ.. జనసైనికులకు జాగ్రత్తలు చెప్పిన కొడాలి నాని

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి సడెన్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై ప్రేమ పుట్టుకొచ్చింది. నిజానికి అది ప్రేమ కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు వ్యతిరేకంగా జనసైనికులను రెచ్చగొట్టే కార్యక్రమం. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కొడాలి నాని ఇవాళ ఒక విజ్ఞప్తి చేశారు. అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకుంటారని.. ఆయనను కాపాడాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నట్టుగా తెలిపారు. పవన్ కళ్యాణ్ ను రక్షంచుకోవాల్సిన అవసరం జనసేనికులు.. అభిమానులకు ఉందన్నారు. చంద్రబాబు ఓట్లు కావాలి కానీ సీట్లు ఇవ్వరన్నారు.

kodali nani.jpg

పవన్ ఓ లెక్కా..?

రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని టార్గెట్‌గా పెట్టుకోలేదని 175 స్థానాల్లో గెలవడమే మా లక్ష్యమన్నారు. కచ్చితంగా చెబుతున్న పవన్ కళ్యాణ్‌ను ఓడించేది టీడీపీ (TDP)యేనని తెలిపారు. ఎన్నికల అనంతరం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్‌లైన చంద్రబాబును, నాదెండ్లను పవన్ కల్యాణ్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడన్నారు. అధికారంలో ఉన్న ఎన్టీఆర్‌ (NTR)నే కూల్చి పడేసిన చంద్రబాబు, నాదెండ్లకు పవన్ ఒక లెక్కా? అని కొడాలి నాని ప్రశ్నించారు. 3 శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి.. 20శాతం ఉన్న వర్గానికి 24 సీట్లా? అని ప్రశ్నించారు. జనసేనకి ఇచ్చిన సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయన్నారు. ఇవ్వడానికి చంద్రబాబుకి.. తీసుకోవడానికి పవన్ కు సిగ్గుండాలన్నారు. కానీ రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్‌ఫర్ అవ్వవని కొడాలి నాని శాపనార్థాలు పెట్టారు.

pavn.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 04 , 2024 | 03:50 PM