Share News

CM Chandrababu: పార్వతమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:20 PM

Andhrapradesh: మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్వతమ్మ ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేష సేవలందించారని కొనియాడారు.

CM Chandrababu: పార్వతమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 25: ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ (Former MP Magunta Parvatamma) మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సంతాపం తెలియజేశారు. మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. పార్వతమ్మ ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేష సేవలందించారని కొనియాడారు.

AP Highcourt: ఎమ్మెల్యే ఆదిమూలంకు హైకోర్టులో బిగ్ రిలీఫ్..


ఒంగోలు, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. దశాబ్ధాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ స్థానిక ప్రజలతో మాగుంట కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. పార్వతమ్మ మృతి ఆ ప్రాంత ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన సీఎం చంద్రబాబు.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


అనారోగ్యంతో కన్నుమూత...

కాగా.. ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యురాలు, దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్వతమ్మ చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల కుమారుడు విజయబాబు మృతితో పార్వతమ్మ మరింత కృంగిపోయారు. ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతిన్నది. కొంతకాలంగా పార్వతమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Amrapali: వరద నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలి..


అయితే ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పార్వతమ్మకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందజేశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం పార్వతమ్మ కన్నుమూశారు. పార్వతమ్మ మృతిపట్ల రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు. ఈరోజు మధ్యాహ్నం పార్వతమ్మ భౌతికకాయాన్ని నెల్లూరులోని స్వగృహానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం రేపు(గురువారం) వరకు స్వగృహంలోనే ఉంచనున్నారు. రేపు సాయంత్రం పార్వతమ్మ అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

Jaggareddy: లడ్డు వివాదం వెనక ఉంది బీజేపీనా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tirumala Laddu Row: ఆసక్తికర పరిణామం.. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వెళ్లిన కేఏ పాల్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2024 | 12:22 PM