Share News

AP News: GCCలు, HTD భాగస్వాములు CXOలతో ఫలవంతమైన చర్చలు: చంద్రబాబు

ABN , Publish Date - Nov 21 , 2024 | 07:22 AM

ప్రపంచ స్థాయి ఐటి పాలసీతో నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా ఉంచే భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నామన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం రాత్రి GCCలు, HTD భాగస్వాములు CXOలతో సీఎం భేటీ అయ్యారు. ఫలవంతమైన చర్చ జరిగిందని సమావేశం అనంతరం ఆయన ట్వీట్ చేశారు.

AP News: GCCలు, HTD భాగస్వాములు CXOలతో  ఫలవంతమైన చర్చలు: చంద్రబాబు

అమరావతి: ఐటీ ల్యాండ్‌స్కేప్‌ను (IT landscape) మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ డెవలపర్‌లు, GCCలు , HTD భాగస్వాములకు చెందిన CXOలతో ఫలవంతమైన చర్చ జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. కో-వర్కింగ్ స్పేస్‌లు, నైబరింగ్ హబ్‌లు, ఇంటిగ్రేటెడ్ ఐటి పార్కుల ద్వారా సౌకర్యవంతమైన నమూనాలను, ఉపాధి అవకాశాలను చర్చించామన్నారు. ఆవిష్కరణ, సహకారాన్ని పెంపొందించడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తమమైన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. ప్రపంచ స్థాయి ఐటి పాలసీతో నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా ఉంచే భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బుధవారం రాత్రి సీఎం చంద్రబాబు GCCలు, HTD భాగస్వాములు CXOలతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఆయన ట్వీట్ చేశారు.


కాగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవే కాదు.. మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా మంత్రివర్గ సమావేశాంలో ఆమోదించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు..

- రాష్ట్రంలో 85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం.

- నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం.

- లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం.

- లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనేదానిపై చర్చ.

- పార్లమెంట్‌లో అనుసరించిన విధానం ఇక్కడ కూడా కొనసాగించాలని నిర్ణయం.

- దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం.

- కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేబినెట్‌లో వచ్చిన ప్రతిపాదనలకు నిర్ణయం.

- ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు ప్రత్యామ్నాయ విభాగం ఏర్పాటుకు నిర్ణయం.

- స్వయంగా ఈగల్ పేరును సూచించిన సీఎం చంద్రబాబు.

- కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌లు పునరుద్ధరించాలని నిర్ణయం.

- ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్ గ్రిడ్‌లో విలీనం చేయాలని నిర్ణయం.

- అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం.

- కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొంసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు.

- స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు మంత్రివర్గం ఆమోదం.

- మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.

- లోకల్‌గా వున్న సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహకాలను పవన్ ప్రస్తావించారు.

- కల్చరల్ హెరిటేజ్ టెక్స్‌టైల్ టూరిజంతో పాటు సేఫ్టీ పాలసీపైన కూడా కేబినేట్‌లో సూచనలు ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జనంలోకి మనం..

మరో పదేళ్లు చంద్రబాబే సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 21 , 2024 | 07:34 AM