YS Sharmila: ఏపీ ఎన్నికల ఫలితాలపై రేపటి నుంచి షర్మిల రివ్యూ మీటింగ్స్
ABN , Publish Date - Jun 18 , 2024 | 07:44 PM
ఏఐసీసీ అగ్రనేతలను నిన్న(సోమవారం) ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కలిశారు. ఏపీ రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై చర్చించిన విషయం తెలిసిందే. అయితే రేపటి(బుధవారం) నుంచి విజయవాడలో మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలపై కేడర్‌కు షర్మిల దిశానిర్దేశం చేస్తారు.
అమరావతి: ఏఐసీసీ అగ్రనేతలను నిన్న(సోమవారం) ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కలిశారు. ఏపీ రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై చర్చించిన విషయం తెలిసిందే. అయితే రేపటి(బుధవారం) నుంచి విజయవాడలో మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలపై కేడర్‌కు షర్మిల దిశానిర్దేశం చేస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్ర రత్న భవన్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో ఏపీ ఎన్నికల ఫలితాలు, పలు కీలక అంశాలపై షర్మిల మాట్లాడుతారు. ఎల్లుండి నుంచి రెండు రోజుల పాటు పార్లమెంట్ వారీగా ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులతో షర్మిల రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తారు.
ఈ నెల 20 వ తేదీన కడప, కర్నూల్, నంద్యాల, అనంతపురం, హిందూపూర్, నెల్లూర్, ఒంగోల్, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, నర్సాపూరం, రాజమండ్రి, తిరుపతి, చిత్తూరు, రాజంపేట నాయకులతో సమావేశమై ఆయ జిల్లాల్లో పార్టీ పరిస్థితుల గురించి చర్చించనున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీని బలోపేతం దిశగా పార్టీ శ్రేణులకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఈ నెల 21న అరకు, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, విజయవాడ పార్లమెంటు వారీగా షర్మిల రివ్యూ నిర్వహిస్తారు. ఈ సమావేశాలకు జిల్లాల అధ్యక్షులు, కీలక నేతలు హాజరు కావాలని ఏపీ కాంగ్రెస్ హై కమాండ్ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Nara Bhuvaneshwari: అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలు
Nadendla Manohar: అక్రమార్కులను ఎవరిని వదలిపెట్టం.. మంత్రి నాదెండ్ల వార్నింగ్
Pawan Kalyan: నాదెండ్ల ఓకే.. పవన్ ఏమంటారో..!!
TDP: జగన్ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని
Read Latest AP News and Telugu News