వరద బాధితులకు విరాళాలు
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:08 AM
విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
ఆత్మకూరు, సెప్టెంబరు 11: విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆత్మకూరు బంగారు దుకాణాల యాజమాన్యం అసోసియేషన్ వారు వేల్పనూరులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్వగృహంలో కలిసి రూ.3,01,116 విరాళాన్ని అందజే శారు. అలాగే శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ వంగాల శివరామిరెడ్డి తరుపున రూ.లక్ష, ఎంఎం గార్డెన్ యజమాని మోమిన్ మున్నా రూ.25వేలు విరాళం అందజేశారు. ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ.. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయ మని అన్నారు. ఆపదలో ఉన్న వారికి మానవత్వంలో ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. అంతకుముందు బంగారు దుకా ణాల అసోసియేషన్ వారు ఎమ్మెల్యే బుడ్డాను ఘనంగా సత్కరించారు. సంఘం ఉపాధ్యక్షుడు ఆర్ఎం.వలి, కార్యదర్శి సుభానీ, కోశాధికారి వలి బాషా, సభ్యులు శేషఫణి, తబ్రేష్, వెంకటేష్, ప్రవీణ్‌కుమార్, షఫి, అస్లాం, సుభానీ, జబీవుల్లా, నజీర్ అహ్మద్, వేణుగోపాల్, ఖాదర్‌బాషా ఉన్నారు.