Minister Amarnath:ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్... గుడివాడ అమర్నాధ్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Nov 09 , 2024 | 02:23 PM
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. నిజంగా వైసీపీ కార్యకర్త తప్పుడు పోస్టులు పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు చట్టం ప్రకారం వ్యవహారించాలని అన్నారు.
విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై వ్యతిరేకంగా పెడుతున్న అసభ్యకర, వ్యంగ్య పోస్టులపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని గుడివాడ అమర్నాధ్ మండిపడ్డారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా వైసీపీ కార్యకర్త తప్పుడు పోస్టులు పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు చట్టం ప్రకారం వ్యవహారించాలని అన్నారు. తాము ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు ఇవ్వలేదని.. సంతకం పెట్టి కూడా కొట్టేశారని మండిపడ్డారు అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. విశాఖపట్నంలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ వెనుక ఎవరున్నారనేది తేల్చాలని అన్నారు. ఇప్పటికి జగన్‌పై ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి. కావాలని ఇబ్బందులు పెడితే వదిలే ప్రసక్తే లేదని గుడివాడ అమర్నాధ్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
Supreme Court: పుణ్య క్షేత్రాలను ప్రత్యేక రాష్ట్రాలు చేయాలా?
Read Latest AP News And Telugu News