AP Politics: అధికారం కోసం షర్మిలను కూడా చంపేస్తారేమో.. అయ్యన్న కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:15 PM
Andhrapradesh: ప్రతీ రోజు ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల మాట్లాడటం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో షర్మిలపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం, జనవరి 30: ప్రతి రోజు ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై (CM Jagan Reddy) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల మాట్లాడటం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు (TDP Leader AyyannaPatrudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘జగన్ చాలా చాలా దుర్మార్గుడు. జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్ అందరూ ఒక్కటే. అధికారం కోసం ఏమైనా చేస్తాడు. జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల గట్టిగా మాట్లాడుతున్నారు. బాబాయిని చంపినట్లు షర్మిలను చంపుతారని నాకు అనుమానం ఉంది’’ అంటూ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు వెంటనే సెక్యూరిటీని పెంచాలన్నారు. సొంత బాబాయిని చంపేశారని, అందుకే తమకు జగన్ మీద అనుమానం ఉందన్నారు.
జగన్‌పై షర్మిల ఎదురు దాడి...
కాగా... ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక షర్మిల తన మార్క్ చూపించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సొంత అన్న అని కూడా చూడకుండా జగన్‌పై ఫైర్ అవుతున్నారు. తన కుటుంబాన్ని చీల్చారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపైనా షర్మిల్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ‘అసలు కుటుంబాన్ని చీల్చింది ఎవరు నువ్వు కాదా’.. అంటూ జగన్‌పై మండిపడ్డారు. రోజురోజుకూ జగన్‌పై తన మాటల ప్రవాహాన్ని షర్మిల పెంచుకుంటూ పోతున్నారు. ‘‘జగన్ అసలు నా అన్నే కాదు’’ అంటూ ఫైర్ అయ్యారు కూడా.
అయితే షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు కూడా మూకుమ్మడిగా మాటల దాడికి దిగారు. దీంతో తనపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలకు కూడా షర్మిల వార్నింగ్‌లు ఇస్తూ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో షర్మిల, వైసీపీ నేతల మాటల యుద్ధంతో ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...